BIG BREAKING : పేలిన బస్సు టైర్లు, అర్ధరాత్రి హంగామా.. మరెన్నో అప్డేట్స్ మన సాక్షి బిగ్ బ్రేకింగ్..!
మన సాక్షి పత్రిక పాఠకులకు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. స్థానిక వార్తల నుంచి జాతీయ, అంతర్జాతీయ వార్తల వరకు ఎప్పటికప్పుడు ఈరోజు బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

BIG BREAKING : పేలిన బస్సు టైర్లు, అర్ధరాత్రి హంగామా.. మరెన్నో అప్డేట్స్ మన సాక్షి బిగ్ బ్రేకింగ్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
మన సాక్షి పత్రిక పాఠకులకు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. స్థానిక వార్తల నుంచి జాతీయ, అంతర్జాతీయ వార్తల వరకు ఎప్పటికప్పుడు ఈరోజు బ్రేకింగ్ న్యూస్ మీకోసం..
మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం :
మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడుతున్నాయి.అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే చర్యలు చేపడుతున్నారు.
రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి హంగామా :
శివరాంపల్లిలోని ‘బిగ్ డాడీ’ బార్‌ను అర్ధరాత్రి 12 దాటినా నడుపుతుండటంతో పోలీసులు మూసివేయించేందుకు వెళ్లారు. సిబ్బంది, కస్టమర్లు వాగ్వివాదానికి దిగారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఓ యూట్యూబర్‌కు గాయాలయ్యాయి.
చంద్రగిరిలో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై కేసు నమోదు :
మోహిత్ రెడ్డి సహా మరికొందరు వైసీపీ నేతలపై కేసులు.. చంద్రగిరిలో రాత్రి అంబేద్కర్ విగ్రహం దగ్గర రోడ్డుపై ఆందోళన.. ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు.. కోటాల, నరసింగాపురం, అగారాల, ఐతేపల్లి, రామిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానాల్లో రీ–పోలింగ్ కోసం డిమాండ్.
వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్. :
చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్. ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు.
పేలిన బస్సు టైర్లు.. తప్పిన ప్రమాదం :
జోగులాంబ గద్వాల జిల్లా NH-44 అలంపూర్ ఫ్లైఓవర్‌పై పీఆర్ఎల్ ట్రావెల్స్ బస్సు టైర్లు పేలి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రొద్దుటూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న 36 మంది ప్రయాణికులలో ఒకరికి గాయాలవ్వగా.. మిగతావారు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం









