Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : నేడు మిర్యాలగూడకు ముగ్గురు మంత్రుల రాక.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఎప్పుడంటే..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని తుంగ పహాడ్ వద్ద నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభంకు శుక్రవారం ముగ్గురు మంత్రులు హాజరుకానున్నారు.

Miryalaguda : నేడు మిర్యాలగూడకు ముగ్గురు మంత్రుల రాక.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఎప్పుడంటే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని తుంగ పహాడ్ వద్ద నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభంకు శుక్రవారం ముగ్గురు మంత్రులు హాజరుకానున్నారు.
రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ,ఎస్ సి అభివృద్ధి శాఖల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ లు పాల్గొననున్నారు.

Also Read : Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల సందేశాలు.. వ్యవసాయ శాఖ క్లారిటీ..!

తుంగ పహాడ్ వద్ద ప్రారంభించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, అడవిదేవులపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం, శాండ్ బజార్లకు శంకుస్థాపన చేయనున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద సమావేశ నిర్వహించనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు మిర్యాలగూడ చేరుకోనున్న మంత్రులు 5.30 గంటలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభం చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల పర్యటన కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మరిన్ని వార్తలు