TOP STORIESBreaking Newsజాతీయం

Phonepe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇది అస్సలు మిస్ చేసుకోకండి..!

Phonepe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇది అస్సలు మిస్ చేసుకోకండి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

దేశవ్యాప్తంగా ఇప్పుడు యూపీఐ ద్వారానే పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. మొట్ట మొదట భారత ప్రభుత్వం నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు పూర్తిగా నగదు రహిత పేమెంట్స్ జరుగుతున్నాయి. పది రూపాయల వస్తువు నుంచి లక్షల్లో చెల్లింపులు కూడా యూపీఐ ద్వారానే చేస్తున్నారు.

వినియోగదారులు కూడా ఎక్కువగా ఆన్లైన్ లావాదేవీలకే ఇష్టపడుతున్నారు. డిజిటల్ లావాదేవీలు స్కానర్, క్యూఆర్ కోడ్, మొబైల్ నెంబరు ద్వారా చెల్లించడం ఎక్కువగా జరుగుతున్నాయి. కాగా ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు ఆ సంస్థను అదిరిపోయే శుభవార్త తెలియజేశాయి.

ఇప్పటివరకు ఆయా యూపీఐ ల ద్వారా ఒక లక్ష రూపాయల వరకు మాత్రమే బదిలీ చేసే అవకాశం ఉండేది. కానీ ఆ లావాదేవీల గరిష్ట పరిమితిని చెంచాయి. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా ఐదు లక్షల రూపాయల వరకు లావాదేవీలు చేసుకునే పరిమితిని పెంచాయి.

కాగా 5 లక్షల వరకు వినియోగదారుల జాబితాలో పన్ను చెల్లింపుదారులు, విద్యాసంస్థల పేమెంట్స్, ఐపీఓ, హాస్పిటల్స్ బిల్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ రిటైల్ ట్రాన్సాక్షన్ సిస్టం ఇలాంటి కేటగిరీలో యూపీఐ సిస్టం అధిక లావాదేవీలకు అవకాశం ఇచ్చింది.

దీని ద్వారా యూపీఐ లావాదేవీలు మరింతగా సులభతరం కానున్నాయి. భారీగా డిజిటల్ పేమెంట్స్ చేసే అవకాశం వచ్చినందున లావాదేవీలు జరిపే సమయంలో అవతలి నెంబరు డీటెయిల్స్ కరెక్ట్ గా చూసుకున్నాక బదిలీ చేయాల్సి ఉంది. పొరపాటు జరిగితే నష్టం వాటినే అవకాశం ఉంది.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు