Good News : మహిళా దినోత్సవ కానుకలు.. కొత్తగా 3 పథకాలు ప్రారంభం..!
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మూడు కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ పథకాలను ప్రవేశపెట్టేందుకు కసరత్తు కొనసాగుతోంది.

Good News : మహిళా దినోత్సవ కానుకలు.. కొత్తగా 3 పథకాలు ప్రారంభం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మూడు కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ పథకాలను ప్రవేశపెట్టేందుకు కసరత్తు కొనసాగుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతను పెంపొందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మూడు పథకాలలో రెండు పథకాలకు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టడం విశేషం.
ప్రారంభించనున్న పథకాలు
- ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం : పిల్లల విద్యాభ్యాసం కోసం రూ.1 లక్ష వరకు పవలా వడ్డీకే రుణ సౌకర్యం అందించనున్నారు.
- ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం : కుమార్తె వివాహానికి దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు.
- యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్లు : యానిమేటర్లకు రూ.15 వేల విలువైన స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
ఇప్పటికే మహిళల సంక్షేమం కోసం ‘సూపర్ సిక్స్’ హామీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని శ్రీ శక్తి పథకం ద్వారా అమలు చేస్తున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం కొనసాగుతోంది. త్వరలో ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త పథకాల ప్రారంభంతో రాష్ట్రంలోని మహిళలకు మరింత ఆర్థిక భరోసా కలగనుందని ప్రభుత్వం భావిస్తోంది.