Google : గూగుల్ లోగో @ 10 ఇయర్స్.. న్యూ లుక్, డిఫరెంట్ ఏంటి..!

Google : గూగుల్ లోగో @ 10 ఇయర్స్.. న్యూ లుక్, డిఫరెంట్ ఏంటి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
గూగుల్ లోగోకు టెన్ ఇయర్స్.. గూగుల్ న్యూ లుక్ తో డిఫరెంట్ గా మారుస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ లోగో “జి” ను కొత్త డిజైన్ తో పునరుద్ధరించారు. అయితే కొత్త లోగో వెర్షన్ ఆవిష్కరించింది. ఇది ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులో బ్లాక్ లకు బదులుగా ఒకే రంగులో ప్లూయిడ్ గ్రేడ్ విధానాన్ని అనుసరించింది. 10 సంవత్సరాలుగా ఉన్న పాత లోగోను మార్చింది.
అయితే న్యూ లుక్ లో డిఫరెంట్ ఏంటి..?
గత పది సంవత్సరాలుగా గూగుల్ లోగో “జి” ప్లాట్ గా బ్లాక్ లో రంగులకు బదులుగా జి లోగో ఇప్పుడు నాలుగు రంగులను మిగితం చేసి గ్రేడియన్టుగా కలిగి ఉంది. ఇది ఐకాన్ కు మరింత ఆధునికత డైనమిక్ రూపాన్ని అందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లను ఉపయోగించుకోవాలని గూగుల్ ఉద్దేశం. అందుకుగాను ఇది ఒక చిహ్నంగా పనిచేస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గూగుల్ సెర్చ్ యాప్ ద్వారా ముందుగా ఐఓఎస్, పిక్సెల్ యూసర్లకు కొత్త లోగో అందుబాటులోకి రానున్నది. గూగుల్ యాప్ డేటా వర్షన్ 16. 18 ద్వారా కొన్ని ఆండ్రాయిడ్ డిజైన్లలో కూడా దీన్ని ఉపయోగించనున్నారు. గూగుల్ దీనిని ఇంకా విడుదల చేయలేదు. అయితే రాబోయే కొన్ని వారాల్లో కొత్త లోగో మరిన్ని డిజైన్లలో అందుబాటులోకి ఉంటుందని తెలిసింది.
MOST READ :









