Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుహైదరాబాద్

Health Insurance : హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్..!

Health Insurance : హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్..!

హైదరాబాద్, మన సాక్షి:

దక్షిణాది రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. తద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన ఆరోగ్య బీమా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న రోజుల్లో ఈ రెండు రాష్ట్రాల్లో 14 కొత్త శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు 10 వేల మంది బీమా ఏజెంట్లను నియమించాలని సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.

ఇప్పటికే విజయవాడలో జోనల్ కార్యాలయం ఉండగా, హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుంది. నగరంలో మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, చాలా మందికి బీమా లేకపోవడం గమనార్హం. దాదాపు 45 శాతం మంది ఆసుపత్రి ఖర్చుల కోసం సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు గెలాక్సీ నేరుగా ప్రజలతో కలిసి పనిచేయడం, పంపిణీదారులతో భాగస్వామ్యం చేసుకోవడం వంటి చర్యలు చేపట్టనుంది.

స్థానిక అవసరాలకు అనుగుణంగా బీమా పథకాలను రూపొందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై కూడా దృష్టి సారించనున్నట్లు ఎండీ & సీఈఓ జి. శ్రీనివాసన్ తెలిపారు. గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన గెలాక్సీ ప్రామిస్ పథకానికి మంచి స్పందన లభిస్తోంది. ఇది రూ. 3 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు బీమా మొత్తాన్ని అందిస్తోంది. దీంతోపాటు పలు ఇతర అనుబంధ పథకాలను కూడా అందుబాటులో ఉంచింది.

MOST READ : 

  1. Miryalaguda : ఎప్ సెట్ ఫలితాల్లో కె.ఎల్.ఎన్ విద్యార్థుల ప్రభంజనం..!

  2. Miryalaguda : లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  3. Mutual Funds : ఏప్రిల్‌లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ జోరు.. రూ.70 లక్షల కోట్లకు ఏయూఎం..!

  4. Bitter guard: కాకరకాయ తింటున్నారా.. పొరపాటున కూడా ఈ ఆహారాలతో కలిపి తినకండి..!

  5. Rythu : రైతుల ఆగ్రహం.. ధాన్యం తగలబెట్టి నిరసన..!

మరిన్ని వార్తలు