TOP STORIESBreaking Newsహైదరాబాద్

UPI : గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్ వచ్చేసింది.. తెలుసుకోండి..!

UPI : గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్ వచ్చేసింది.. తెలుసుకోండి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్ వచ్చేసింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్ల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. డిజిటల్ పేమెంట్స్ యూజర్ల భద్రత కోసం ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం.. యూపీఐ లావాదేవీలు పేమెంట్స్ ఎవరికి పంపుతున్నారో ఆ వ్యక్తి పేరు యూజర్లకు చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే యూపీఐ లో పేమెంట్ పంపే వ్యక్తి పేరు నేరుగా బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయి ఉంటుంది. QR కోడ్ తో స్కాన్ చేసినప్పుడు పేర్లు కానీ.. పేమెంట్ చెల్లింపు దారులు రిజిస్టర్ పేర్లు చూపించకూడదు. యూజర్ల అసలు పేరు మాత్రమే కనిపించాలి.

మీ కాంటాక్ట్ లిస్టులో సేవ్ చేసిన పేరుతో సంబంధం ఉండదు. మీరు డబ్బులు పంపే వ్యక్తి అసలు పేరు బ్యాంకు రికార్డులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది. యూజర్ల అసలు పేరు మాత్రమే కనిపించాలి. ఒకవేళ యూపీఐ యూజర్లు డబ్బు పంపే వ్యక్తి పేరును యాప్ లో మార్చేందుకు ఏదైనా యాప్ వినియోగించినా యూపీఐ యాప్ డిజేబుల్ చేస్తుంది.

లావాదేవీలు చేసే ముందు మీరు కన్ఫామ్ బటన్ టాప్ చేసి డబ్బు సరైన వ్యక్తికి వెళ్తుందో లేదో వెరిఫికేషన్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే ఈ కొత్త ఫీచర్ యూపీఐ రూల్ ప్రకారం జూన్ 30 నుంచి అమలులోకి రానున్నది. పర్సన్ టు పర్సన్, పర్సన్ టు మర్చంట్ లావాదేవీల రెండింటికి ఇది వర్తిస్తుంది. UPI యూజర్ల ఎకౌంట్లో ఖచ్చితమైన సమాచారం.. డబ్బులు భద్రతగా ఉంచుకోవచ్చును.

ఆన్లైన్ పేమెంట్ చేసే సమయంలో పొరపాటు న ఇతర కాంట్రాక్టర్లకు ఎంచుకుంటే పేమెంట్ ప్రాసెస్ అయ్యే ముందు మీకు వార్నింగ్ అలర్ట్ కూడా వస్తుంది. అప్పుడు ఆ పేమెంట్ చెక్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఈ నిబంధనలు జూన్ 30వ తేదీ నుంచి NPCI ప్రవేశపెట్టనున్నది.

Similar News : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల్లో కీలక మార్పులు..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ షాక్.. కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే ఇక భారమే..!

  3. UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

  4. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

మరిన్ని వార్తలు