Breaking Newsఆంధ్రప్రదేశ్క్రీడలు
Hockey : రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థిని ఎంపిక..!
Hockey : రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థిని ఎంపిక..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీ మట్లవారిపల్లె ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యా ర్థిని స్రవంతి రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం సీటీఎంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లాస్థాయి హాకీ పోటీల్లోని బాలికల విభాగంలో అండర్-17 స్థాయిలో విద్యార్థిని రాణించినట్లు తెలిపారు. నవంబరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థినిని ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఈ విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మండల ప్రజా ప్రతినిధులు, ప్రజలు విద్యార్థినికి అభినందనలు తెలిపారు.
LATEST UPDATE :









