ఝార్ఖండ్ లో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు గురుకుల విద్యార్థి..!
ఝార్ఖండ్ లో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు గురుకుల విద్యార్థి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సింగారం కూడలి దగ్గర ఉన్న దామరగిద్ద బాలుర సాంఘిక సంక్షేమ పాఠశాల లో ఎనిమిదో తరగతి చదువుతున్న బి. రాఘవేంద్ర జాతీయస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికైనాడని కోచ్ చక్రవర్తి తెలిపారు.
ఈనెల 13, 14, 15 తేదీల్లో హైదరాబాదులోని మౌలాలి హౌసింగ్ బోర్డ్ ప్లే గ్రౌండ్ లో నిర్వహించిన 34వ రాష్ట్రస్థాయి కోకో పోటీల్లో మహబూబ్నగర్ జిల్లాకు ప్రాతినిథ్యం వహించిన బి.రాఘవేంద్ర కోకో పోటీలో ప్రతిభ చాటి జాతీయస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు.
ఈనెల 28 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఝార్ఖండ్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో బి.రాఘవేంద్ర పాల్గొంటున్నాడని కోచ్ ఎస్.చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా బి.రాఘవేంద్రను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కోకో సంఘం అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, జిల్లా కార్యదర్శి జి ఏ విలియమ్స్, సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, పిడి నవీన్, పిడి గణేష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థికి అభినందించారు.
MOST READ :
-
Narayanpet : నారాయణపేట లో యువజన ఫెస్టివల్.. పాల్గొన్న జిల్లా కలెక్టర్..!
-
District Collector : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత..!
-
Bigg Boss 8 Telugu : సోనియాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. షాకింగ్
-
Dsc Result : తెలంగాణ డీఎస్సీ – 2024 ఫలితాలు విడుదల.. రిజల్ట్ కోసం ఈ లింకు క్లిక్ చేసి చూసుకోండి..!
-
KTR : బావమరిదితో లీగల్ నోటీసు పంపితే.. మాట్లాడను అనుకున్నావా..!









