Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District Collector : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత..!

District Collector : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత నిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.

కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాగా సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమానికి 35 అర్జిలు వచ్చినట్లు కలెక్టరేట్ ఏ వో తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరీమ నరుల, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

MOST READ

మరిన్ని వార్తలు