Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : నారాయణపేట లో యువజన ఫెస్టివల్.. పాల్గొన్న జిల్లా కలెక్టర్..!

Narayanpet : నారాయణపేట లో యువజన ఫెస్టివల్.. పాల్గొన్న జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జాతీయ యువజన ఫెస్టివల్ లో భాగంగా సోమవారం జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్. ఆర్ గార్డెన్ లో సోమవారం జాతీయ యువజన ఉత్సవాల ఫెస్టివల్ ను అట్టహాసంగా నిర్వహిoచారు.

ఈ ఫెస్టివల్ కు జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్, జిల్లా స్పోర్ట్స్ చైర్ పర్సన్ సిక్తా పట్నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ జాతీయ యువజన ఫెస్టివల్ భారతదేశంలో ప్రతి ఏడాది స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని నిర్వహించబడే ఒక ముఖ్యమైన పండుగ అని, యువత ను ప్రోత్సహించేందుకు కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖయువ జనోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం యువతలో దాగివున్న సుజనాత్మకత, సాంస్కృతిక ఆవిష్కరణలను, క్రీడా పోటీలను ప్రోత్సహించడం అన్నారు. ఈ ఫెస్టివల్ యువతలో జాతీయ భావాన్ని, సామరస్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక విభాగంలో చిన్నారుల చేసిన భరతనాట్య ప్రదర్శనను చూసిన కలెక్టర్ ఆ చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సమాధ్యక్షుడు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ ఈవెంట్ లో పలు రకాల సంస్కృతిక కార్యక్రమాలు వర్క్ షాప్ లో కిడా పోటీలు సోషల్ కార్యక్రమాలు, సైన్స్ మేళా నిర్వహించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన మొదటి స్థానంలో నిలిచిన వారిని రాష్ట్రస్థాయికి, రాష్ట్రస్థాయిలో రాణించిన వారిని జాతీయస్థాయికి పంపించడం జరుగుతుందని చెప్పారు.

జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ యువత పెడ దోవ పట్టకుండా సన్మార్గంలో నడిచి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. యువత దేశానికి వెన్ను ముక అని తెలిపారు. కాగా ఈ ఫెస్టివల్ లో గ్రూపు ఫోక్ సాంగ్ లో భాగంగా కోస్గి మండలం ముశ్రీఫా జడ్పీహెచ్ఎస్ కు చెందిన విద్యార్థులు మొదటి స్థానం నిలవగా, సోలో ఫోక్ సాంగ్ విభాగంలో దత్తు స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ విద్యార్థి మొదటి స్థానంలో నిలిచారు.

ఇక సైన్స్ మేళాలో దామరగిద్ద జడ్పిహెచ్ఎస్ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. విజేతలకు బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. అలాగే ఆద్య నాట్యమండలి చిన్నారులకు సన్మానo చేశారు. ఈ కార్యక్రమంలో డి. ఈ. ఓ. అబ్దుల్ ఘని,జిల్లా సైన్స్ ఫెయిర్ అధికారి భాను ప్రకాష్, పి ఆర్ టి యు జిల్లా అధ్యక ప్రధాన కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, పల్లె వెంకట్ రెడ్డి, జిల్లాకు చెందిన పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు