తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లావ్యవసాయం

District collector : 48 గంటల్లో ధాన్యం చెల్లింపులు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..!

District collector : 48 గంటల్లో ధాన్యం చెల్లింపులు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి ప్రతినిధి :

రైతులు వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోగా మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  అన్నారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు పై అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రారంభించాలని అన్నారు. సోమవారం నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు.

రైతులకు ప్రతిరోజు వాతావరణ శాఖ సూచనలు అందజేయాలని, అకాల వర్షం వల్ల పంట ఎక్కడ నష్టం కలగకుండా చూడాలని అన్నారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓ.పి.ఎం.ఎస్ లో నమోదు చేయాలని, రైతులకు ప్రభుత్వ లక్ష్యం ప్రకారం 48 గంటలలోగా దాన్యం డబ్బులు అందేలా చూడాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.

రైస్ మిల్లుల వద్ద ఎక్కడ దాన్యం కోతలు ఉండడానికి వీలులేదని, దానం నాణ్యతను కొనుగోలు చేసే సమయంలోనే పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని రైతులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగవద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ మద్దతు ధరకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ  సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు