TOP STORIESBreaking Newsజాతీయం

GST on UPI : ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.2వేలకు పైగా పేమెంట్లపై జిఎస్టి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

GST on UPI : ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.2వేలకు పైగా పేమెంట్లపై జిఎస్టి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతి చిన్న పేమెంట్ కూడా యూపీఐ ద్వారానే చేస్తున్నారు. లక్షల రూపాయల వరకు కూడా యూపీ ఐ ఉపయోగించి పేమెంట్లు కొనసాగుతున్నాయి. యూపీఐ పేమెంట్ లు చేసే దేశంగా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

అయితే ఇప్పటివరకు యూపీఐ పేమెంట్ లపై ఎలాంటి చార్జీలు విధించడం లేదు. యూపీఐ పేమెంట్ లపై చార్జీలు వేస్తారని గతంలో ప్రచారం జరిగినా.. అలాంటిది ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఇటీవల ఆర్.బి.ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా యూపీఐ పేమెంట్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

యూపీఐ ద్వారా లావాదేవీలు పూర్తిగా ఉచిత శకం శాశ్వతంగా ఉండకపోవచ్చు అని పేర్కొన్నారు. యూపీఐ సేవలు కొనసాగించాలంటే ఎవరో ఒకరు ఖర్చును భరించాల్సి ఉంటుందని, యూపీఐ సేవలు పూర్తిగా ఉచితం శాశ్వతంగా ఉండవని ఆయన వ్యాఖ్యానించారు.

దాంతో రాబోయే కాలంలో ప్రభుత్వం అలాంటి లావాదేవీలపై చార్జీలు విధించవచ్చునని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియాలలో ప్రభుత్వం 2000 రూపాయల కంటే ఎక్కువ యూపీఐ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇతర యాప్ ల ద్వారా లావాదేవీలు చేస్తే జిఎస్టి విధించాలని బావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 2000 రూపాయల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై క్లారిటీ ఇచ్చింది.?

జీఎస్టీ ఉద్దేశం లేదు :

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీల పై జిఎస్టి విధించే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.

2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీల పై జిఎస్టి విధించాలని ఈలోచిస్తుందనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. జిఎస్టి కౌన్సిల్ ఎటువంటి సిఫారసు చేయలేదని ఆయన పేర్కొన్నారు. యూపీఐ లావాదేవీల పై జిఎస్టి ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని ఆయన పేర్కొన్నారు.

క్లిక్ చేసి ఈ వార్తలు కూడా చదవండి

  1. Suryapet : సూర్యాపేట జిల్లాలో సంచలనం.. ఏడాది క్రితం అదృశ్యమైన వ్యక్తి ప్రత్యక్షం.. అది ఏంటో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే..!

  2. TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!

  3. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్.. మీడియా పేరుతో వసూళ్లు..!

  4. PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!

మరిన్ని వార్తలు