తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Nalgonda : రాజకీయ ప్రయోజనాల కోసమే కుల గణన సర్వే పై విమర్శలు.. గుత్తా సుఖేందర్ రెడ్డి..!

Nalgonda : రాజకీయ ప్రయోజనాల కోసమే కుల గణన సర్వే పై విమర్శలు.. గుత్తా సుఖేందర్ రెడ్డి..!

నల్లగొండ, మన సాక్షి :

దేశంలో ఏ రాష్ట్రములో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రములో సామాజిక , ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే ( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ) నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

ఏ రాష్ట్రములో నిర్వహించని విధంగా 94, 863 ఎన్యుమరేటర్స్ , 9 ,628 సూపర్ వైజర్స్ , 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లు ద్వారా కేవలం 50 రోజుల్లో ఈ సర్వేను నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో 97 శాతం ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకున్నారన్నారు.

ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే లెక్కలు సరిగ్గా లేవు అనడం కరెక్ట్ కాదు. ఓటర్ లిస్ట్ కి, సర్వే లెక్కలకు తేడా ఉంటుంది ఎందుకు అంటే ఒక్కో వ్యక్తికి రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఓటర్ లిస్ట్ ఆధార్ కి అనుసంధానం చేస్తే కరెక్ట్ గా లెక్కలు వచ్చేయి అన్నారు

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సర్వే లెక్కలు తప్పుల తడఖా అని విమర్శలు చేయడం సబబు కాదు. ప్రభుత్వం చేసిన కృషిని ఏ పార్టీ వారైనా అభినందించాలన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా , ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం మంచిది కాదన్నారు.3 లక్షల కుటుంబాలు సర్వే అధికారులకు వివరాలు ఇవ్వలేదు. వారు కూడా
ఇప్పుడు వివరాలు ఇవ్వవచ్చు అని తెలిపారు.

సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉన్నతాధికారులను , అధికారులను అభినందిస్తున్నా అన్నారు.  గత పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డ్స్ కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ని ఇస్తుంది. అని తెలిపారు అలాగే , బిపిఎల్, ఏపీఎల్ కార్డ్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కి లేఖ రాశాను. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు.

బిపిఎల్ ఏపిఎల్ కార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నిన్నటి వరకు రెండు ఎకరాల వరకు రైతు భరోసాను సర్కారు అందించింది. ఎకరాకు 6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. అలాగే సేద్యం చేసే భూములన్నీకి కూడా రైతు భరోసా పథకాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్ట్ ప్రకటనపై నేను మాట్లాడను.

రాజకీయాలకు నాకు సంభందం లేదు. కుల , మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఎవరు మాట్లాడిన అది తప్పే . బిసిలు, అగ్రకులాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా మాట్లాడం అస్సలు కరెక్ట్ కాదు. మదర్ డైరీ ఆస్తులు అమ్మడం సరికాదు. ఆస్థి అమ్మడమే పరిష్కారం కాదు.సంస్థను కాపాడుకోవాలన్నారు.

■ MOST READ : 

  1. Miryalaguda : ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక ఆదేశాలు..!

  2. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాలేదా.. అయితే ఇలా చేయండి..!

  3. Ration Cards : హమ్మయ్య.. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. తొలిగిన సందిగ్ధం..!

  4. Suryapet : ఎండి పోయిన బోరు నుండి ఎగిసిపడుతున్న గంగమ్మ.. (వీడియో)

మరిన్ని వార్తలు