District collector : హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా సాధ్యం.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
District collector : హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా సాధ్యం.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
పదవ తరగతి వార్షిక పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సింగారం కూడలిలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో సోమవారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ హాస్టల్ విద్యార్థులకు ప్రేరణ తరగతుల నిర్వహణలో భాగంగా నిర్వహించిన శిబిరానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరై జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించి జిల్లాకు, వసతి గృహాలకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. సబ్జెక్టులపై పట్టు సాధించడానికి కష్టపడి చదవాలన్నారు. ప్రతిరోజు సబ్జెక్టులపై ఉపాధ్యాయులతో అవగాహన పెంచుకొని చదవాలన్నారు.
హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. పరీక్షలకు 15 రోజుల ముందు అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ కావాలన్నారు. అనంతరం ఆల్ ఇన్ వన్ క్యస్షన్ బ్యాంక్ లను మరియు బి. సి. వెల్ఫేర్ మంత్రి ఇన్స్పిరేషన్ లెటర్స్లను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి అబ్దుల్ కలీం, డి ఆర్ డి ఓ. మొగులప్ప,డి. పి. ఆర్. ఓ. రషీద్,ఉపాధ్యాయ లు, స్వామి, సంగీత, నారాయణరెడ్డి, మధు, మహేష్, మధుసూదన్ రావు, వాసంత్రావు, కనకప్ప, శ్రీలక్ష్మి, రోజమని, శివప్రసాద్,వార్డెన్లు, మాసూద్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..!
-
Breaking News : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!
-
District collector : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!









