Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsసంక్షేమంహైదరాబాద్

TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..!

TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ లో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నది. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందుకుగాను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో L2 జాబితా లో సొంత స్థలం ఇల్లు లేని వారి జాబితా సిద్ధం చేశారు. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులలో L1 లో 21 93 లక్షలు, L2 లో 19 96 లక్షల మంది, L3 లో 33.87 ఉన్నారు. కాగా L1 జాబితాలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారు ఉన్నారు. వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించి 5 లక్షల రూపాయలను ప్రభుత్వం అందించనున్నది. L2 జాబితాలో స్థలంతో పాటు ఇల్లు లేని వారు ఉన్నారు. వారికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించే విషయంపై కసరత్తు నిర్వహిస్తుంది.

బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో 2.36 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయగా 1.58 లో పూర్తయ్యాయి. పూర్తయిన ఇండ్లలో 1.36 లక్షల ఇండ్లు పంపిణీ చేసింది. మిగతా ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. చాలామంది కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోవడంతో పనులను మధ్యలోనే ఆపివేశారు. అయితే కాంట్రాక్టర్లకు ముందుకొచ్చే వారికి ఇసుకతో పాటు రాయితీలు కల్పించి నిర్మాణాలను పూర్తిచేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

■ Similar News : 

  1. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మూడు జాబితాలు.. అవేంటో తెలుసా.. ఇలా చెక్ చేసుకోండి..!
  2. Indiramma Indlu : మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా.. లేదా.. మీ ఫోన్లోనే ఇలా చెక్ చేసుకోండి..!
  3. Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్లకు కొత్త నిబంధనలు.. లేటెస్ట్ అప్డేట్..!
  4. Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అదిరిపోయే మరో గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు