తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

MLA Adinarayana : ప్రకృతి సిద్ధమైన తాటికల్లుతో ఆరోగ్యం.. ఎమ్మెల్యే ఆదినారాయణ..!

MLA Adinarayana : ప్రకృతి సిద్ధమైన తాటికల్లుతో ఆరోగ్యం.. ఎమ్మెల్యే ఆదినారాయణ..!

దమ్మపేట, మన సాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట కల్లు గీత సొసైటీకి చెందిన సభ్యులకు అశ్వారావుపేట పట్టణంలో ప్రొహిబిషన్ & అబ్కారి శాఖ వారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ వెల్ఫేర్ శాఖ వారు కాటమయ్య రక్ష కవచ్ కిట్ల పంపిణీ చేశారు.

అశ్వారావుపేట గోకులనంధం లో ఈ కార్యక్రమం కి ముఖ్యఅతిథిగా పాల్గొన్న అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ తాటి చెట్టు నుండి లభించే ప్రకృతి సిద్ధమైన కల్లు పోషకాలతో కలిగి తాగినవారికి ఆరోగ్యం కలుగజేస్తుంది అన్నారు.

తన చిన్నతనంలో వారికి తాటాకులు ఇల్లు ఉండేదని తాటాకుల కోసం వాళ్ళ నాన్న తాటి చెట్టు ఎక్కి తాటాకుల కోసేవారని చెప్పారు. అలాంటి తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాద నివారణకై తన ప్రభుత్వం వచ్చిన 8 నెలలోనే ఒక ప్రణాళికతో కాటమయ్య రక్ష కవచ్ సేఫ్టీ మోకుని నిపుణల సమక్షంలో తయారు చేపించి, శిక్షణ ఇచ్చి, తదనంతరం కిట్లు పంపిణీ చేస్తుందని కల్లు గీత వృత్తి చేసే వారి చెట్టు ఎక్కి, దిగే క్రమంలో ప్రమాద నివారణకై వారి ప్రాణాన్ని కాపాడే ఉద్దేశ్యం తో ఈ పథకం తమ ప్రభుత్వం చేపట్టింది అని తెలియజేశారు.

అలాగే చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి హాస్పటల్లో వైద్యం పొందే వారికి తన పరిధిలో గల 30 లక్షల రూపాయల వరకు ఆర్థికసాయం హాస్పిటల్ కి చెల్లిస్తాము అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కల్లు గీత సొసైటీ సభ్యులు మాట్లాడుతూ తమ గీత వృత్తిని కాపాడుకోవాలంటే తాటి చెట్లను నరక కుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు, నరుకుతున్న తాటి చెట్లకు ప్రత్యాయముగా కల్లుగీత సొసైటీలకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తే తాము తాటి, ఈత, ఖర్జూరపు చెట్లను పెంచుతామన్నారు.

గీత వృత్తి చేస్తున్న వారికి ప్రత్యేక కార్పొరేషన్, , మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి కల్లుగీత సొసైటీ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు విద్యా, వైద్యం కొరకు ప్రభుత్వం తరపున ఆర్థిక చేయూత కల్పించాలి కోరారు, గత ప్రభుత్వం గౌడకులస్తులకు కేటాయించిన మద్యం టెండర్లలో రిజర్వేషన్ ని కల్లు గీత సొసైటీలకు కల్పించాలి అని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారిణి ఇందిర, సీనియర్ అసిస్టెంట్ అట్టం లక్ష్మణరావు, అబ్కారీ & ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కే.రాజేశ్వరరావు, దమ్మపేట కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు బంధం చెన్నారావు, పానుగంటి లక్ష్మణ్ గౌడ్, పానుగంటి ఆదినారాయణ, రాజులపాటి చెన్నారావు, నాగుల సుబ్బారావు,

మట్టా సత్యనారాయణ, పానుగంటి ప్రసాద్, కందిమళ్ళ సాంబశివరావు, కట్టా ప్రసాద్, యార్లగడ్డ ఏసుబాబు, కొనకళ్ళ చెన్నారావు, కొనకళ్ళ సత్యనారాయణ, లింగాల సూర్యరావు, గొల్లపల్లి వెంకటేశ్వరావు, కొనకళ్ళ సురేష్, కొనకళ్ళ సత్తిలింగం, మారగాని శ్రీను, అశ్వారావుపేట గీత కార్మిక సొసైటీ సభ్యులు అరేపల్లి సాంబశివరావు, బాబూరావు, గోవింద్, ఎక్సైజ్ కానిస్టేబులు తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు