ఒక్క గూగుల్ పే పేమెంట్.. ఎంత పని చేసింది.. లండన్ టు హైదరాబాద్..!
ఒక్క గూగుల్ పే పేమెంట్.. ఎంత పని చేసింది.. లండన్ టు హైదరాబాద్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఒక్క గూగుల్ పే పేమెంట్ 17 సంవత్సరాల వైవాహిక జీవితంలో చిచ్చు పెట్టింది. మీరు ఎంతో అందంగా ఉన్నారు. మీ నవ్వు బాగుంది. అనగానే ఆ మాటలు ఎలా ఈజీగా నమ్ముతారో చూద్దాం. ఈ మాటలకు లండన్ నుంచి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. 17 సంవత్సరాల వైవాహిక జీవితంలో చిచ్చు పెట్టింది. వివరాల ప్రకారం..
హైదరాబాదులోని అల్వాల్ లో ఉండే ఓ జంటకు 17 సంవత్సరాల క్రితమే వివాహమైంది. వారికి 13 సంవత్సరాల కుమారుడు, 12 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. సంవత్సరం నర క్రితం అతనికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడంతో లండన్ కు పోవాల్సి వచ్చింది. అయితే అతడు భార్యా పిల్లలను ఇక్కడే ఉంచి గత నవంబర్ ఒక్కడే లండన్ కు వెళ్లడం జరిగింది.
అప్పటివరకు బానే ఉంది. భర్త లండన్ వెళ్లిపోయిన తర్వాత భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి అతగారింట్లోనే ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆమె తల్లి చనిపోయింది. అస్తికలను కలిపేందుకు ఓ ట్రావెల్స్ కారు మాట్లాడుకుని వెళ్లి వచ్చారు.
అయితే డ్రైవర్ కు అద్దె చెల్లించేందుకుగాను గూగుల్ పే పేమెంట్ చేసింది. దాంతో ఆ మహిళ నెంబర్ సేవ్ చేసుకొని ఆ డ్రైవర్ రెండు, మూడు రోజులు హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ పలకరించసాగాడు. మొదట్లో ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి మీ నవ్వు బాగుంటుంది.. మీరు చాలా అందంగా ఉంటారు. అంటూ నెమ్మదిగా డ్రాప్ చేశాడు. దాంతో ఆమె కూడా అతని మాయలో పడి ప్రతి రోజు ఫోన్లో మాట్లాడటం.. అతని కలవడం చేసింది.
ఈ విషయం అత్తగారింట్లో తెలియడంతో వారు లండన్ లో ఉన్న తన కుమారుడికి చెప్పారు. అయితే ఆమె భర్త సెప్టెంబర్ నెలలో భార్యతో కాంటాక్ట్ అయ్యి తన ఫ్యామిలీని కూడా లండన్ కి తీసుకువచ్చేందుకు అనుమతి వచ్చిందని పాస్ పోర్టు, వీసాలను పంపిస్తున్నానని చెప్పి సెప్టెంబర్ 16వ తేదీన లండన్ కు రప్పించాడు.
అయితే ఆమె భర్త తల్లి సెప్టెంబర్ 29న మరణించింది. దాంతో అతను భార్య పిల్లలను లండన్ లోనే వదిలేసి తల్లి అంత్యక్రియలకు అతడు ఇండియాకు తిరిగి వచ్చాడు. భర్త వచ్చిన మరుసటి రోజునే సెప్టెంబర్ 30న పిల్లలను వదిలేసి భార్య కూడా ఇండియాకు వచ్చేస్తుంది. తమ తల్లి తమను వదిలేసి పోయిందని పిల్లలు తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. ఆ మాటలతో కంగుతిన్న భర్త భార్యకు కాల్ చేయడానికి ట్రై చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది.
వెంటనే అతడు లండన్ కు ఫ్లైట్ బుక్ చేసుకుని అక్టోబర్ ఒకటో తేదీన వెళ్ళాడు. భార్య గురించి ఆరా తీశాడు. అయితే ఆమె లండన్ నుంచి ముంబైకి వచ్చినట్లుగా తెలుసుకున్నాడు. చివరికి అక్టోబర్ మూడవ తేదీన శంషాబాద్ మధుర నగర్ కాలనీలో ఉన్నట్లు తెలుసుకొని ఫోన్ చేయగా కాల్ లిఫ్ట్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని.. ఇక్కడ శంషాబాద్ లో పెట్టారని, ఇప్పుడే బాలాపూర్ వైపు తీసుకెళ్తున్నట్టు చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది.
ఈ విషయం పోలీసులకు చెప్పిన భర్త పోలీసులను, స్నేహితులను అలర్ట్ చేశాడు. దాంతో పోలీసులు ఉన్నతాధికారులకు లండన్ నుంచి మెయిల్స్ పెట్టి తన భార్య మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీసులు పర్యవేక్షణలో రాజేంద్రనగర్, శంషాబాద్, బోయిన్పల్లి తదితర పోలీస్ విభాగాలు అప్రమత్తమై ఫోన్ ట్రాక్ చేశారు. అయితే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో చివరికి లొకేషన్ రాజేంద్ర నగర్ లోనే చూపించింది. పోలీసులు ఎంత గాలించిన ఆచూకీ దొరకలేదు. దాంతో కేస్ మిస్టరీగా మారింది.
అయితే హైదరాబాదులో ఉంటున్న తన స్నేహితుల ద్వారా భార్య ఫోన్ నెంబర్ తో పాటు ఆమెను డ్రాప్ చేసిన మాయగాడి డ్రైవర్ ఫోన్ నెంబర్ కూడా తెలుసుకున్నాడు. టాక్సీ డ్రైవర్ కు కాల్ చేయగా ఆమె లిస్ట్ చేయగా తాము గోవాలో ఉన్నట్లు తెలిపారు. దాంతో భర్త స్నేహితులు ఆమెతో మాట్లాడగా టాక్సీ డ్రైవర్ తనని ట్రాప్ చేశాడని, తనని కాపాడాలని తిరిగి భర్త దగ్గరకు చేర్చాలంటూ లైవ్ లొకేషన్ తో పాటు గోవా నుంచి హైదరాబాద్ కు వస్తున్న టికెట్ వాట్సప్ చేసింది.
ఈ విషయాన్ని శంషాబాద్ పోలీసులు భర్త స్నేహితులు పంపారు. అలర్ట్ అయిన పోలీసులు మహిళతో పాటు ఆమె వెంట ఉన్న వ్యక్తిని బస్సు దిగకుండా చూడాలని అలర్ట్ చేశారు.
ఆదివారం బయలుదేరిన మహిళని , ట్యక్సీ డ్రైవర్ ను సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఆమనగల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని శంషాబాద్ పిఎస్ కు తరలించారు. ఇదే విషయాన్ని భర్త చెప్పడంతో అతను వెంటనే సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు టికెట్ బుక్ చేశాడు. అయితే ఈ విషయంపై ఆమెని పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర విషయాలు తెలియజేసిందిహ
టాక్సీ డ్రైవర్ తన భర్తను చంపేస్తానని.. చెప్పకుండా నువ్వు లండన్ కి ఎలా వెళ్లావు అంటూ ఫోన్ చేసి బెదిరించడంతో లండన్ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు ఆమె చెప్పింది. కాగా మరోవైపు ట్యాక్సీ డ్రైవర్ మాత్రం నా తప్పు ఏమీ లేదు ఆమె నాతో ఉంటాను అన్నది.. ఇద్దరం ఇష్టపూర్వకంగానే గోవా వెళ్లాం అంటూ సమాధానం వచ్చినట్లు తెలిసింది. అయితే ఇద్దరు మేజర్ లు కావడంతో కేసులు నమోదు చేయలేదని సమాచారం.
LATEST UPDATE :
-
TGSRTC : బతుకమ్మ, దసరా ప్రత్యేక సేవల కోసం ముందస్తు రిజర్వేషన్.. TSRTC కాల్ సెంటర్..!
-
Nalgonda : పేదింటి విద్యార్థికి ఎంబిబిఎస్ లో సీటు. తల్లికి మూడుసార్లు బ్రెయిన్ ఆపరేషన్, ఫీజు కట్టలేక చదువులకు దూరం..!
-
Viral Video : బస్సులోని ప్రయాణికులకు షాక్ ఇచ్చిన చిరుత.. (వైరల్ వీడియో)
-
Nalgonda : రుణాలు ఇప్పిస్తామని భారీ మోసం.. నకిలీ బ్యాంకు అధికారుల ఆటకట్టు..!









