TOP STORIESBreaking News

Nagarjunasagar : నాగార్జునసాగర్ జలాశయానికి భారీ వరద.. 8 గేట్ల ఎత్తివేత..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ జలాశయానికి భారీ వరద.. 8 గేట్ల ఎత్తివేత..!

నాగార్జునసాగర్, మన సాక్షి :

నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ శ్రీశైలం నుండి వస్తున్న వరద నీరు పెరుగుతూ ఉండటంతో బుధవారం మధ్యాహ్నానికి 8 గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి దిగునకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ కు1,08782 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంటుండగా వచ్చింది వచ్చినట్లుగా సాగర్ జలాశయం నుండి బయటకు విడుదల చేస్తున్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద : 

8 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 64800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు…

ఇన్ ఫ్లో : 108782 క్యూసెక్కులు.

ఔట్ ఫ్లో : 108782 క్యూసెక్కులు.

ప్రస్తుత నీటి మట్టం : 590.00 అడుగులు…

పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.

ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450

MOST READ : 

మరిన్ని వార్తలు