Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో ఉబికి వచ్చిన పాతాళ గంగమ్మ.. (వీడియో)

Suryapet : సూర్యాపేట జిల్లాలో ఉబికి వచ్చిన పాతాళ గంగమ్మ.. (వీడియో)

అర్వపల్లి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లాలోని చరిత్రరాత్మకమైన స్వయంభు యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంగణం అర్వపల్లి, నీటి వసతి లేక దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ సమస్యను యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రేఖ ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీమతి డాక్టర్ రేఖ బోయినపల్లి కి దుర్గామాత నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన ఆమెకు తెలియజేయడంతో, మంగళవారం ఉదయం బోరు బండితో , తన సహచరులతో కలిసి దేవాలయ ప్రాంగణానికి చేరుకున్నారు.

ఆగమ సాంప్రదాయ పద్ధతుల ద్వారా దేవాలయ అర్చకులు దేవాలయ చైర్మన్ గ్రామ ప్రముఖులతో కలిసి బోరు పాయింటును నిర్ధారించి పని ప్రారంభించారు. బోరు బండి ప్రారంభించిన ఐదు నిమిషాల్లోనే 20 ఫీట్లు భూమి లోపలికి హైమర్ వెళ్లిన అనంతరం పాతాళ గంగ ఒక్కసారిగా బయటికి వచ్చింది.

ప్రజలు, భక్తులు, నిర్వహణ కమిటీ సభ్యులు అందరూ కూడా ఆశ్చర్య ఆనందాలతో మునిగి తేలారు. అనేక సంవత్సరాల నుండి నీటి వసతి లేక భక్తులు ఇబ్బందులను లక్ష్మీనరసింహస్వామి ఈరోజు తీర్చినట్లు ప్రజలు కొనియాడారు.

బోరుతో మోటార్ బిగించి ట్యాంక్ నిర్మాణం చేసి ప్రజలకు మంచినీటితోపాటు, స్నానాలకు బాత్రూములకు దేవాలయానికి అవసరమైన అన్ని కార్యక్రమాలకు నీటిని వినియోగిస్తున్నట్లు బోరు మోటర్ దాత రేఖ బోయినపల్లి తెలియజేయడంతో భక్తులు ఆనందంతో మునిగి తేలారు.

VIDEO

 

MOST READ : 

మరిన్ని వార్తలు