Breaking Newsఆంధ్రప్రదేశ్ఆరోగ్యంజాతీయంజిల్లా వార్తలుతెలంగాణ

Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!

Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!

మనసాక్షి, వెబ్ డెస్క్ :

ప్రపంచవ్యాప్తంగా రక్త పోటు (బిపి) బాధితులు పెరుగుతున్నారు. రోజురోజుకు వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పెరుగుతున్న రక్తపోటు బాధితుల వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. బీపీ బాధితుల్లో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ప్రతి పది మందిలో ముగ్గురు హైబీపీతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న ప్రతి ఐదుగురిలో నలుగురికి తగిన చికిత్స అందడం లేదని, దానివల్ల అనేకమంది బీపీ కారణంగా అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారని పేర్కొంది.

హైబీపీతో అనారోగ్య సమస్యలు :

బిపి వల్ల ఎలాంటి సమస్యలు రావని వాటికి రెగ్యులర్ గా టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ వారికి రోజువారిగా వేసుకునే టాబ్లెట్లు చికిత్స కాదు.. కేవలం పి పి నార్మల్ గా ఉంచేందుకు మాత్రమే అవి పని చేస్తున్నాయి. ప్రతి ఐదుగురిలో నలుగురికి సరైన చికిత్స అందడం లేదని, హై బీపీ కారణంగా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

అధిక రక్తపోటును పట్టించుకోకుండా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది.

ALSO READ : Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!

బిపి చికిత్స కవరేజ్ ని పెంచగలిగితే 2023 – 2050 మధ్య 76 మిలియన్ మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2016 నుండి రెండు 2020 మధ్యకాలంలో భారత దేశంలో అధిక రక్తపోటు కలిగిన రోగులను నాలుగింట ఒక వంతు కంటే తక్కువ, వాళ్ల రక్తపోటు నియంత్రణలో ఉందని పేర్కొన్నది.

జాతీయ ఆరోగ్య మిషన్ పెద్ద ఎత్తున హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇన్షియేటివ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పటికీ అధిక రక్తపోటు బాధితులు భారతదేశంలోని పెరిగుతూ ఆందోళన కలిగిస్తుందని, 2019 – 2020 జాతీయ కుటుంబాల సర్వేలో పురుషులలో 24 శాతం స్త్రీలలో 21 శాతం మందికి రక్తపోటు ఉందని నివేదించింది.

ALSO READ : Car Driver : కారు డ్రైవర్ ఖాతాలో రూ. 9 వేల కోట్లు జమ.. ఒక్కసారిగా షాక్ అయిన డ్రైవర్..!

ప్రపంచవ్యాప్తంగా ముగ్గురి వ్యక్తులలో ఒకరిని రక్తపోటు ప్రభావితం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో పేర్కొన్నది. ప్రాణాంతక పరిస్థితికి కారణమయ్యే గుండెపోటుకు, మూత్రపిండాలు దెబ్బ తినడానికి, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పేర్కొన్నది.

బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య 1990 నుండి 2029 మధ్యకాలంలో 650 మిలియన్ల నుండి 1.3 బిలియన్లకు పెరిగిందని పేర్కొన్నది. అధిక రక్తపోటుతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పొగ తాగడం మానేయాలని, ఉప్పు తగ్గించాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

ALSO READ : Chandra Babu : చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు.. సిఐడి కస్టడీకి చంద్రబాబు..!

మరిన్ని వార్తలు