TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లాములుగు జిల్లా

అధిక ధరలు.. అర్ధరాత్రి వరకు విక్రయాలు..!

అధిక ధరలు.. అర్ధరాత్రి వరకు విక్రయాలు..!

దమ్మపేట మండలం లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

బానిసలుగా మందు బాబులు

యువత చేతిలోనే బెల్ట్‌ షాపులు

మనసాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల గ్రామాల్లో బెల్ట్ షాపుల జోరు ఇంత అంత కాదు. మండల కేంద్రంలో బడి, గుడి అని తేడా లేకుండా దమ్మపేట పట్టణంలో గల్లీకో బెల్ట్ షాపు వెలిశాయి. పట్టణంలోని నడిబొడ్డున ఇల్లు మాటున యథేచ్ఛగా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు. మద్యం దుకాణాలు తెరవక ముందు, మూసి వేసిన తర్వాత మద్యం ప్రియులంతా బెల్ట్ షాపులనే ఆశ్రయిస్తున్నారు.

మద్యం దుకాణాలు తెరచి ఉన్న అమాయక గిరిజనులకు కావలసిన తక్కువ ఖరీదైన బ్రాండ్లు మద్యం దుకాణాల్లో లభించకపోవడంతో బెల్ట్ షాపులను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే మద్యం షాపుల్లో లభించని ఎన్నో బ్రాండ్లు బెల్ట్ షాపుల్లో దొరకటం ఆశ్చర్యకరానికి గురిచేస్తుంది. ఇక గ్రామాల్లో హోటల్, దాబాలు, కిరాణా దుకాణాల మాదిరిగా ఉన్నప్పటికీ లోపల తతంగమంతా వేరేలా ఉంటుంది. మద్యం విక్రయాలతో పాటు అక్కడే తాగేందుకు నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

కూర్చుని సంపాదించే మార్గంగా బెల్ట్ షాపులను ఎన్నుకుంటున్నారు. మద్యం సీసా, బీర్ల పై అదనంగా రూ. 20 నుంచి 30 వరకు వసూళ్లు చేస్తున్నారు. చిన్న బెల్టు షాపు అయినా రోజుకు రూ. 1500 నుంచి 3000 వరకు ఆదాయం వస్తుండడంతో బెల్ట్ షాపుల నిర్వహణ పై చాలా మంది యువకులు మొగ్గు చూపుతున్నారు.

కొన్ని రోజుల క్రితం బెల్టు షాపులు వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడటం భార్యాభర్తలు విడిపోవడం, కన్నబిడ్డలను చదువు మాన్పించేసి మద్యానికి బానిసైన తల్లిదండ్రులు డబ్బుల కోసం కన్న బిడ్డలను వేరే పనికి పంపించడం చూసి మనసు చలించి ఈ బెల్ట్ షాపులను ఎలాగైనా అరికట్టాలని అనే ఉద్దేశంతో మండల కేంద్రానికి సంబంధించిన ఒక యువ న్యాయవాది బెల్ట్ షాపుల గురించి హైకోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ విషయం బహిరంగంగా అందరికీ తెలిసినా అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా బెల్ట్ షాపులు సంఖ్య మరికొన్ని పెరగటం ఆశ్చర్యాన్ని గురిచేసింది.

చూసీ చూడనట్లుగా అధికారులు :

బెల్ట్ షాపుల్లో ఇంత బహిరంగంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అధికారులకు నెలవారీగా విధించే మద్యం అమ్మకాల టార్గెట్ కోసం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మండల కేంద్రంలో నే గల్లీకో బెల్ట్ షాపు నడుస్తున్నట్టు అంచనా. కానీ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో వీరి అక్రమాలకు అంతేలేకుండా పోయింది. ఏది ఏమైనా పట్టణ గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్ షాపులను నియంత్రించాలని ప్రజాసంఘాలు, మహిళలు కోరుతున్నారు.

యువత చేతిలోనే బెల్ట్‌ షాపులు :

మండలంలో నడుస్తున్న మొత్తం బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్న వారిలో 80 శాతం మంది పదో తరగతి నుంచి డిగ్రీలోపు చదువుకున్న యువకులే ఉన్నారు. ఉపాధి లేక, వ్యవసాయ పనులు చేసుకోలేక మద్యం వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే బెల్ట్ షాపులు నడుపుతూ అర్ధరాత్రి వరకు తెరిచే ఉంచుతున్నారు.

Reporting :

Shanmukh, Dammapeta

MOST READ : 

  1. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)

  2. Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!

  3. TG News : మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి రూ.12 వేలు..!

  4. Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!

  5. Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!

మరిన్ని వార్తలు