Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!

Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

డిజిటల్ మోసాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా సైబర్ మోసగాళ్లు సరికొత్త రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఫోన్ పే యాప్ లాగానే ఫేక్ యాప్ ఉంటుంది. అలాంటి ఫేక్ యాప్ లతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ ఫోన్ పే యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.

ఇలాంటి ఫేక్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఎకౌంట్ ఖాళీ అవుతుంది. ఫోన్ పే యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ ను వెరిఫై చేసుకోవాలి. మీరు సరైన దానిని ఎంపిక చేసుకున్నారా..? దానినే డౌన్లోడ్ చేసుకున్నారా..? అని సరి చూసుకునే విధంగా వెబ్సైట్ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ఫేక్ యాప్ పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు ఏపీకే ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకోకుండా ఉండాలి.ఒకవేళ మోసపూరిత యాప్ ను డౌన్లోడ్ చేసి ఉండొచ్చని భావిస్తే ఆ యాప్ ను వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయాలి. నకిలీ యాప్ లు మీ డేటాకు తీవ్ర హాని కలిగిస్తాయి. అప్రమత్తంగా ఉండకుంటే మీ ఎకౌంటు ఖాళీ.

ఈ విషయంపై సీనియర్ ఐపీఎస్, తెలంగాణ ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ ఫేక్ యాప్ లతో జాగ్రత్త గా ఉండాలని తన ఎక్స్ ఖాతాలో హెచ్చరించారు. నకిలీ యాప్ లతో నగదు బదిలీ చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియాలో ఇలాంటి వందలాది వీడియోలు చక్కర్లు కొడుతున్నాయని ఎక్స్ వేదికగా ఆయన వార్నింగ్ ఇచ్చారు.

కొంత డబ్బు చెల్లిస్తే ఫేక్ ఫోన్ పే యాప్ పంపిస్తామంటూ మాయమాటలు చెప్పి కొందరు సొమ్ము చేసుకుంటున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్ హెచ్చరించారు.

|MOST READ : 

  1. Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!

  2. TG News : మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి రూ.12 వేలు..!

  3. Ration Cards : లిస్టులో పేరు లేకుంటే మళ్ళీ దరఖాస్తుకు అవకాశం.. కొత్త రేషన్ కార్డుల పై లేటెస్ట్ అప్డేట్..!

  4. February : ఫిబ్రవరి నెల.. భూమ్మీద ఉన్నవారికి ఇదే ఆఖరు.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యమే..!

  5. Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!

మరిన్ని వార్తలు