Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsసంక్షేమంహైదరాబాద్

Ration Cards : లిస్టులో పేరు లేకుంటే మళ్ళీ దరఖాస్తుకు అవకాశం.. కొత్త రేషన్ కార్డుల పై లేటెస్ట్ అప్డేట్..!

Ration Cards : లిస్టులో పేరు లేకుంటే మళ్ళీ దరఖాస్తుకు అవకాశం.. కొత్త రేషన్ కార్డుల పై లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో పేదలకు మంజూరు చేసే కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న గందరగోళమైన పరిస్థితిపై క్లారిటీ ఇచ్చింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కుల గణన సర్వే వివరాల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం భావించడం, రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేయడం.. ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామపంచాయతీలలో ముసాయిదా లిస్టును ప్రదర్శించడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి.

దాంతో కొన్ని ప్రాంతాలలో లిస్టులలో పేర్లు లేని వారు ఆందోళనలకు సైతం దిగారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో రేషన్ కార్డులు ఉన్న వారి పేర్లు కూడా జాబితాలో వచ్చాయి. అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు, సంపన్నుల పేర్లు కూడా జాబితాలో వచ్చాయి.

దాంతో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అన్ని అర్హతలు ఉండి రేషన్ కార్డు జాబితాలో పేర్లు లేని వారు గ్రామసభలలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. లిస్టులో పేరు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రామసభలలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

పాత రేషన్ కార్డులను తొలగించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. పాత రేషన్ కార్డులలో కొత్తగా పేర్లను కూడా చేర్చుతామని పేర్కొన్నారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం గ్రామ సభలలో దరఖాస్తు చేసుకోనున్నారు.

MOST READ :

  1. Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!

  2. February : ఫిబ్రవరి నెల.. భూమ్మీద ఉన్నవారికి ఇదే ఆఖరు.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యమే..!

  3. Gold Price : వీకెండ్ లో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!

  4. District collector : ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. కీలక ఆదేశాలు జారీ..!

  5. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్..!

మరిన్ని వార్తలు