Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : నిజాయితీ చాటుకున్న సెక్యూరిటీ..!

Suryapet : నిజాయితీ చాటుకున్న సెక్యూరిటీ..!

మేళ్లచెరువు, మనసాక్షి:

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని సెక్యూరిటీ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. స్థానిక మైహోం పరిశ్రమకు చెందిన సెక్యూరిటీ సూపర్ వైజర్లు తుపాకుల రామారావు, గండమల్ల సోమయ్యలు విధి నిర్వహణలో భాగంగా మేళ్లచెరువు, చౌటపల్లి రోడ్డుపై వెళ్తుండగా రోడ్డు పై బ్యాగు దొరికింది.

దొరికిన బ్యాగును స్థానిక మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ లో ఎస్సై పరమేష్ కు అందజేశారు. ఈ బ్యాగు కందిబండ గ్రామానికి చెందిన కందుల వీరబాబుదిగా గుర్తించి,అతనికి ఎస్సై అందజేశారు‌.

బ్యాగులో ఉన్న పదివేల నగదుతో పాటు విలువైన బ్యాంకు పత్రాలను బాధితుడికి అందజేశారు. దొరికిన బ్యాగును నిజాయితీగా అందజేసినందుకు సూపర్ వైజర్లను ఎస్సై పరమేష్,మై హోం పరిశ్రమ యూనిట్ హెడ్ నందనమూడి శ్రీనివాసరావులు అభినందించారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..!

  2. ACB : విద్యుత్ ఏడిఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రెండు కోట్లు గుర్తింపు..!

  3. Godavarikhani : డిగ్రీ చదువుతూ.. జల్సాలకు అలవాటు పడి.. పోలీసులకు చిక్కాడు ఇలా..!

  4. Godavari khani: భార్యను హత్య చేసిన భర్త.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

మరిన్ని వార్తలు