Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

TG News : తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..!

TG News : తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..!

నల్లగొండ, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై శ్రద్ధ పెట్టాలని పేదలకు మెరుగైన వైద్యం అందించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. వైద్య రంగానికి ప్రభుత్వం ప్రత్యేక దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అలాగే ఆరోగ్యశ్రీ సిఎంఆర్ పథకాలపై మరోసారి సమీక్ష నిర్వహించాలని కోరారు.

అలాగే ఆరోగ్య శ్రీ, సీఎం ఆర్ ఎఫ్ పథకాలపై మరోసారి సమీక్ష నిర్వహించాలన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వసతులు తక్కువగా ఉండటం కారణంగా పేదలకు ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేసారు. కానీ నేడు తెలంగాణలోని 32 జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మించడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ పట్టణంలో మరో నాలుగు పెద్ద ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మాణంలో ఉన్నవి.

ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ ని అభివృద్ధి చేసి , ఆయా హాస్పిటల్స్ లో పని చేసే డాక్టర్స్ కి ప్రోత్సహకాలు ఇచ్చి మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడలని ప్రభుత్వానికి సూచిస్తున్నాను. హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్ ని బలోపేతం చేయాలనీ డిమాండ్ చేశారు.ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ నిధులను ఇవ్వాల్సిన అవసరం అప్పుడు ఉండదన్నారు.

ఆరోగ్యశ్రీ , నిధులను ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి వినియోగిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయ పడ్డారు. ఫీజు రియంబర్స్ మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ స్కూల్ లు , కాలేజిలు , ప్రభుత్వ పథకాలు మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో , ప్రభుత్వ విద్య సంస్థలలో పని చేసే ఉద్యోగులు బాధ్యతాయుతంగా తమ కర్తవ్యాలను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ అధికారులకు కీలక ఆదేశం.. ఇందిరమ్మ ఇండ్లు అప్పటిలోగా పూర్తి చేయాలి..!

  2. Miryalaguda : విందు కంటె రైతులే ముద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి రూ.2 కోట్లు అందజేసిన ఎమ్మెల్యే బీఎల్ఆర్..! 

  3. Godavarikhani : డిగ్రీ చదువుతూ.. జల్సాలకు అలవాటు పడి.. పోలీసులకు చిక్కాడు ఇలా..!

  4. Additional Collector : అదనపు కలెక్టర్ర్ ఆదేశాలు.. ఆ బార్ అండ్ రెస్టారెంట్లకు జరిమానా..!

మరిన్ని వార్తలు