Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ అధికారులకు కీలక ఆదేశం.. ఇందిరమ్మ ఇండ్లు అప్పటిలోగా పూర్తి చేయాలి..!

District collector : జిల్లా కలెక్టర్ అధికారులకు కీలక ఆదేశం.. ఇందిరమ్మ ఇండ్లు అప్పటిలోగా పూర్తి చేయాలి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లాకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల లక్ష్యాన్ని వీలైనంత త్వరగా చేరుకోవాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి నెలలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. బుధవారం సింగారం చౌరస్తాలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి ఇంటి బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇండ్ల ప్రగతిని ఎప్పటికప్పుడు పంపాలన్నారు. అలాగే పూర్తయిన ఇండ్ల ఫినిషింగ్ వారం వారం రిపోర్ట్ అందించాలన్నారు. టార్గెట్ ప్రకారం ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని అన్ని యూనిట్స్ ఫాలో కావాలని ఆదేశించారు.

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి గురించి మండలాల వారీగా వివరాలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ పిడి శంకర్ డి ఎల్ పి ఓ సుధాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశాలు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..!

  2. TGSRTC : విధి నిర్వహణలో గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి..!

  3. Godavarikhani : డిగ్రీ చదువుతూ.. జల్సాలకు అలవాటు పడి.. పోలీసులకు చిక్కాడు ఇలా..!

  4.  District collector: కుక్కల దత్తతకు భారీ స్పందన..! 

  5. Land : భూములు కొంటున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త..!

మరిన్ని వార్తలు