Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : విందు కంటె రైతులే ముద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి రూ.2 కోట్లు అందజేసిన ఎమ్మెల్యే బీఎల్ఆర్..! 

Miryalaguda : విందు కంటె రైతులే ముద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి రూ.2 కోట్లు అందజేసిన ఎమ్మెల్యే బీఎల్ఆర్..! 

మిర్యాలగూడ, మన సాక్షి :

విందుల కంటే రైతులే ముద్దు అని నిరూపించారు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే. తన నియోజకవర్గ రైతుల కోసం భారీగా విరాళం అందజేశారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ రైతుల సంక్షేమం కోసం రెండు కోట్ల రూపాయలను స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. ఇటీవల ఆయన కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది.

కాగా మిర్యాలగూడలో వివాహ రిసెప్షన్ ను భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ రిసెప్షన్ రద్దుచేసి.. ఆ డబ్బును రైతుల సంక్షేమం కోసం వినియోగించాలని భావించారు. దాంతో రిసెప్షన్ కోసం వినియోగించే ఆ డబ్బును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కుటుంబ సభ్యులతో కలిసి రైతుల సంక్షేమం కోసం వినియోగించాలని కోరారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలోని సుమారు లక్ష మంది రైతులకు ఉపయోగపడే విధంగా ఈ డబ్బులు వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

MOST READ : 

  1. District collector : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!

  2. ACB : విద్యుత్ ఏడిఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రెండు కోట్లు గుర్తింపు..!

  3. Snails : మీ తోటలో నత్తల బెడద ఉందా.. శాశ్వత పరిష్కారం మీకోసం..!

  4. District collector : నిరుద్యోగులకు జిల్లా కలెక్టర్ శుభవార్త.. 19న జాబ్ మేళా..!

  5. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. రాష్ట్రమంతా ఎల్ఈడి వీధి దీపాలు..!

మరిన్ని వార్తలు