Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Hospital : పేషెంట్స్ ఫుల్.. డాక్టర్స్ నిల్..!
Hospital : పేషెంట్స్ ఫుల్.. డాక్టర్స్ నిల్..!
దేవరకొండ : నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయానికి రాకపోవడంతో పేషెంట్లు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతోంది.
ఉదయం 9 గంటలకు రావలసిన వైద్యులు 10 గంటలైనా రావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. దూరప్రాంతాల నుంచి వివిధ తండాల నుంచి గిరిజనులు ఆసుపత్రికి ప్రతిరోజు వస్తు ఉంటారు.
వైద్యులు సమయానుకూలంగా వారికి వైద్యం అందించకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని తనిఖీ చేసి వైద్యుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ కూడా వైద్యుల తీరులో మార్పు రాలేదు.
బుధవారం 10 గంటల వరకు కూడా వైద్యులు ఆసుపత్రికి రాకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు గంటల తరబడి ఎదురు చూశారు.
LATEST UPDATE :
-
Nalgonda : ప్రభుత్వాలు మారినా.. మారని విద్యార్థుల తలరాతలు..!
-
High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ నిరోధించడానికి ఆహారంలో ఇవి తీసుకోండి.. గుండె సురక్షితం, జబ్బులు దూరం..!
-
Kidneys : కిడ్నీలో రాళ్లు ఉన్నాయా.. వాటికి అవే పోవాలంటే ఇలా చేయండి సింపుల్..!
-
Miryalaguda : అర్ధరాత్రి వెళితే తిరస్కరించిన వేళ.. కట్ చేస్తే సన్మానం..!









