Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలునల్గొండవైద్యం

Miryalaguda : అర్ధరాత్రి వెళితే తిరస్కరించిన వేళ.. కట్ చేస్తే సన్మానం..!

Miryalaguda : అర్ధరాత్రి వెళితే తిరస్కరించిన వేళ.. కట్ చేస్తే సన్మానం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా  మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి బ్రెయిన్ లో ( చిన్న మెదడులో) బ్లడ్ క్లాటై తీవ్రమైన అస్వస్థతతో ప్రాణపాయ స్థితికి చేరగా ఓ మూడు ప్రైవేట్ ఆస్పత్రులు జాయిన య్యేందు అర్ధరాత్రి వేళ వెళితే తిరస్కరించిన వేళ… ఆ పేషెంట్ కు రిస్క్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసి కూడా… గోల్డెన్ అవర్ లో ట్రీట్ మెంట్ అందించి ప్రాణాలను కాపాడిన డాక్టర్ ను పేషెంట్, కుటుంబ సభ్యులు సన్మానించారు.

వివరాలు ఇలా ఉన్నాయి… మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన రామచంద్రారెడ్డికి కొద్దిరోజుల క్రితం… చిన్న మెదడు లో రక్తం గడ్డకట్టి వాంతులు, ఇతర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు … స్థానికంగా మల్టీ స్పెషాలిటీ పేరిట నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుక వెళ్లారు. పేషంట్ కండిషన్ గుర్తించిన సదరు ప్రైవేట్ ఆస్పత్రులు … తమకు ఎందుకు రిస్క్ అని వదిలేసిండ్రు.

ఈ తరుణంలో పట్టణంలో డాక్టర్స్ కాలనీలో గల అను మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ కు తీసుకొచ్చారు. దీంతో స్పందించిన డాక్టర్ బాలాజీ .. అర్దరాత్రి 2 గంటల నుంచి తెల్ల వారుజాము వరకు…ట్రీట్ మెంట్ చేసి క్యూర్ చేసిండ్రు. వెంటనే కుటుంబ సభ్యులు… ఆయన్ను హైద్రాబాద్ లోని కార్పోరేట్ ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ ఇప్పించారు.

మొదటి రెండు గంటలో అందిన ట్రీట్ మెంట్ కారణంగా… ప్రాణాలు దక్కినట్లు హైదరాబాద్ లోని కార్పొరేట్ వైద్యులు పేషంట్ కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో హెల్త్ ప్రాబ్లం నుంచి కోలుకున్న భర్త రామచంద్రారెడ్డి తో కలిసి ఆయన భార్య సుజాత రెడ్డి తన భర్త ప్రాణాలను కాపాడిన డాక్టర్ బాలాజీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సలీంతో కలిసి కృతజ్ఞతా పూర్వకంగా సన్మానించారు.

LATEST UPDATE :

మరిన్ని వార్తలు