TOP STORIESBreaking Newsజాతీయంహైదరాబాద్

Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!

Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

సాధారణంగా బంగారం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. కానీ ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా ఉంటుంది.. అనే విషయాలు చాలామందికి తెలియదు. బంగారం ధర ఎలా నిర్ణయిస్తారో..? ఆభరణాలు ఎలా విక్రయిస్తారో..? స్వచ్ఛత ఎలా ఉంటుందో..? అనే విషయం తెలుసుకుందాం..

బంగారం తూకం :

బంగారం ధరను ఎలా నిర్ణయిస్తారనే విషయం తెలుసుకునే ముందు దానిని ఎలా తూకం వేస్తారు. అనే విషయం తెలిసి ఉండాలి. ఆభరణాలు తయారు చేసే బంగారం బరువును గ్రాములలో కొలిచి ధర నిర్ణయిస్తారు. ప్రస్తుతం 22K బంగారం గ్రాము ధర 7900 ఉంది. అనుకుంటే కొనుగోలు చేసే ఆభరణం బరువు 10 గ్రాములు ఉందనుకుంటే దాని ధర ఎంత ఉంటుంది. అనే విషయం తెలుసుకుందాం.. అప్పుడు 10 గ్రాముల తులం బంగారం ధర 79,000 రూపాయలు అవుతుంది.

దానికి బంగారం తో పాటు నగల వ్యాపారులు తయారు చేయడానికి మేకింగ్ చార్జీలు కూడా వసూలు చేస్తారు. మేకింగ్ చార్జీలు బంగారం ధరలో ఒక శాతం ఉంటుంది. లేదంటే ఆభరణాల డిజైన్ ని బట్టి ఫిక్స్డ్ గా ఉంటుంది. సుమారుగా ఒక లక్ష రూపాయల బంగారం హారానికి జ్యువెలరీ దుకాణాన్ని బట్టి మేకింగ్ చార్జీలు 5 నుంచి 20 శాతం వరకు తీసుకుంటారు.

బంగారం స్వచ్ఛత :

బంగారం స్వచ్ఛతను బట్టి ధరను నిర్ణయిస్తారు. ఇందులో చాలా రకాల బంగారం ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు

  • 24K (999 ప్యూరిటీ) ఇది స్వచ్ఛమైన బంగారం.

  • 22K (916 ప్యూరిటీ) దీనిని ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు. దీంట్లో ఆభరణాల మన్నిక కోసం ఇతర లోహాలను కలుపుతారు.

  • 18K (750 ప్యూరిటీ) నిర్దిష్ట ఆభరణాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. మిశ్రమ లోహాలను ఎక్కువగా కలిగి ఉంటుంది.

  • 14K (583 ఫ్యూరిటీ) ఇందులో లోహ శాతం ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది.

హాల్ మార్కింగ్ :

స్వచ్ఛమైన బంగారం 24k, 22K బంగారం ఎక్కువగా ఉంటుంది. ఆభరణాలు తయారీకి వ్యాపారులు వస్తువులపై దీని స్వచ్ఛతను తెలియజేసే ముద్ర వేస్తారు. వీటికి హాల్ మార్కింగ్ ఉంటుంది.

అదనపు ఖర్చులు, బంగారం కొనుగోలు చేసే వారికి బంగారం బరువుతో పాటు మేకింగ్ చార్జీలు, రత్నాలు, వజ్రాలు, కెంపులు, లేదా నీల మణి వంటి రాళ్లు ఉంటే వాటికి కూడా ధర చెల్లించాల్సి ఉంటుంది.

RELEATED NEWS : 

  1. Gold Price : తగ్గేదేలే.. పడిపోయిన బంగారం కొనుగోళ్లు.. అయినా ధర మళ్లీ రూ.2500 హైక్.. ఎందుకంటే..!

  2. Gold Price : గోల్డ్.. ఆల్ టైం రికార్డ్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Gold Price : రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ ధర.. ఒక్కరోజే రూ.11,500, ఈరోజు ధర ఎంతంటే..!

  4. Gold Price : పసిడి ప్రియులకు భారీ ఊరట.. తగ్గిన బంగారం ధర..!

మరిన్ని వార్తలు