TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!

TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త తెలియజేసింది. రైతుల పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డులతో పాటు మరో కొత్తగా 10 మార్కెట్ యార్డులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. రైతులకు రవాణా ఖర్చులు తగ్గించేందుకు స్థానికంగా ఉన్న మార్కెట్లను బలోపేతం చేసి రైతులకు లాభసాటిగా చూసేందుకుగాను కొత్తగా మార్కెట్ యార్డులను ప్రారంభించబోతోంది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వరి పండించే రైతుల నుంచి దొడ్డు ధాన్యంతో పాటు సన్నధాన్యం కూడా ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుంది. సన్నధాన్యం విక్రయించిన రైతులకు అదనంగా క్వింటాకు 500 రూపాయల బోనస్ కూడా అందజేస్తుంది. ఇదిలా ఉండగా కొత్తగా ప్రారంభించబోయే మార్కెట్ల ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 197 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉండగా మరో 10 ప్రారంభించేందుకు తుది ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధమైంది. దాంతో కొత్తగా మార్కెట్ యార్డులు ప్రారంభిస్తే తెలంగాణ రాష్ట్రంలో 207 వ్యవసాయ మార్కెట్ యార్డులు కానున్నాయి.
కొత్త మార్కెట్ యార్డులు ఇవీ..!
నాగర్ కర్నూలు జిల్లాలో పెద్ద కొత్తపల్లి, కోడేరు, నల్గొండ జిల్లాలో దామరచర్ల, పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడు, హనుమకొండ జిల్లాలో ఎలకతుర్తి, వనపర్తి జిల్లాలో పానగల్, వీవనగండ్ల, ఖిలాఘన్పూర్, గోపాల్ పేట, ఖమ్మం జిల్లాలో మత్కేపల్లి మార్కెట్ యార్డులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే మార్కెట్ అధికారులు ప్రాథమిక తుది నోటిఫికేషన్లను జారీ చేశారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో తుది ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధమయ్యారు.
MOST READ :
-
District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!
-
BREAKING : గొలుసు దోపిడీ.. గంటలోనే దుండగులు పట్టివేత..!
-
Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!
-
Rythu Bheema : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల స్వీకరణ..!









