Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లా

BREAKING : గొలుసు దోపిడీ.. గంటలోనే దుండగులు పట్టివేత..!

BREAKING : గొలుసు దోపిడీ.. గంటలోనే దుండగులు పట్టివేత..!

తొర్రూర్, మన సాక్షి :

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో మహిళ గొలుసు దోపిడీకి గురైన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మాటేడు గ్రామానికి చెందిన ముత్యం ప్రేమలీల ఉదయం సుమారు 7 గంటల సమయంలో రోడ్డుపై కోతులను తరిమేస్తుండగా, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆమెతో మాట కలుపుతూ మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెల బంగారు తాడును గుంజుకుని సూర్యాపేట జిల్లా వైపు పారిపోయారు.

సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు వెంటపడగా, గంటలోపే మద్దిరాల సమీపంలో దుండగులను పట్టుకుని తొర్రూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో, దుండగులు ఇతర రాష్ట్రాలకు చెందినవారని పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ తెలిపారు.

MOST READ : 

  1. Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!

  2. Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!

  3. Rythu Bheema : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల స్వీకరణ..! 

  4. Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!

  5. Gas Cylinder : మహిళలకు అదిరిపోయే రాఖి గిఫ్ట్.. వంట గ్యాస్ పై రూ.300 సబ్సిడీ..!

మరిన్ని వార్తలు