TG News : తెలంగాణలో పెన్షన్ దారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై పెన్షన్ కోసం నో టెన్షన్..!
TG News : తెలంగాణలో పెన్షన్ దారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై పెన్షన్ కోసం నో టెన్షన్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ దారులకు భారీ శుభవార్త తెలియజేసింది. దాంతో పెన్షన్ కోసం టెన్షన్ పడే అవసరం లేకుండా పోనున్నది. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో పెన్షన్ దారులకు మేలు జరగనున్నది. ప్రభుత్వం తీసుకునే ఈ తాజా నిర్ణయంతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా డిజిటల్ గవర్నెన్స్ లో ముందు ఉండనున్నది. అయితే అదేంటో తెలుసుకుందాం..
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 42.96 లక్షల మంది పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఉన్నారు. వారిలో దివ్యాంగులకు నెలకు 4016 రూపాయలు ఇస్తుండగా, ఇతర పెన్షన్ దారులకు 2016 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. కాగా పెన్షన్ తీసుకునే సమయంలో ప్రతి నెల వేలిముద్ర పడకపోవడంతో వృద్ధులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
వృద్ధాప్యంలో వేలిపై ఉన్న గీతలు చెడిపోవడంతో వేలిముద్రలు పడక ఇబ్బందులు పడుతుంటారు. దాంతో పెన్షన్ చెల్లింపులో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.
ఫేస్ రికగ్నైజింగ్ యాప్ ద్వారా పెన్షన్ చెల్లించాలని నిర్ణయించింది. ఇది లబ్ధిదారులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. అయితే ముందుగా ఫేస్ రికగ్నైజింగ్ కోసం సెర్ఫ్ టీం తయారు చేసే యాప్ లో సెల్ఫీ తీసి అప్లోడ్ చేస్తారు. దాంతో ఆ సెల్ఫీ ని యాప్ గుర్తిస్తుంది. లబ్ధిదారుడిగా చెబుతుంది. ఆ తర్వాత గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది. ఇది వృద్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ కొత్త విధానం ఈ ఏడాది మే లేదా జూన్ మాసం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకుగాను సెర్ఫ్ ఉద్యోగులకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వేలిముద్రలతో పని లేకుండా కేవలం ముఖాన్ని యాప్ గుర్తించి పెన్షన్ అందజేస్తారు. ఈ విధానం ద్వారా తెలంగాణ రాష్ట్రం డిజిటల్ గవర్నెన్స్ లో ముందుండే అవకాశం ఉంది.
MOST READ :
-
TG News : తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. మరో నూతన కార్యక్రమం ప్రారంభం..!
-
Gold Price : జెడ్ స్పీడులో గోల్డ్.. ఒక్కరోజే రూ.20,200.. తులం ఎంతంటే..!
-
Thahasildar : రైతులు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా పొందండి..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. ఐతే వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్..!
-
Curd Rice : రోజూ పెరుగన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!









