Good News : మహిళలకు భారీ శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..!
Good News : మహిళలకు భారీ శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అన్ని రంగాలలో మహిళలను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను కూడా మహిళల పేరు మీదనే అందజేస్తుంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దాంతోపాటు 500 రూపాయలకు వంట గ్యాస్ అందించడం, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తును అందించడం జరుగుతుంది.
ఇది ఇలా ఉండగా మహిళలకు మరో శుభవార్త తెలియజేసింది. మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు స్వయం ఉపాధిని పెంపొందించేందుకు ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటు అందించనున్నది. డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
అందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 20 వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలను అందించనున్నారు. ఒక్కొక్క గ్రామ సమాఖ్య కమిటీ పరిధిలో ఉన్న సంఘాలకు కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందించనున్నారు.
అందుకుగాను మొదటి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5వేల గ్రామాలలో 5 వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా మహిళలకు అందించనున్నారు. మహిళా సంఘాలకు బ్యాంకులు అందించే రుణాలను పొంది ఉపాధి అవకాశాలను పరుచుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.
LATEST UPDATE :
Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!
Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?










