Hyderabad : ఎయిర్ పోర్టు లో భారీగా హైడ్రో ఫోనిక్ పదార్థాల పట్టివేత..!

Hyderabad : ఎయిర్ పోర్టు లో భారీగా హైడ్రో ఫోనిక్ పదార్థాల పట్టివేత..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
భారీగా హైడ్రో ఫోనిక్ కలుపు మొక్కల పదార్థాలను పట్టుకున్న సంఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టు లో చోటుచేసుకుంది. పక్క సమాచారంతో డిఆర్ఐ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టు లో తనిఖీలు నిర్వహించగా రూ 12 కోట్లు విలువ చేసే 12 కిలోల హైడ్రో ఫోనిక్ కలుపు మొక్కల పదార్థాలను పట్టుకున్నారు.
దుబాయ్ నుండి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కీ వచ్చిన భారతీయ ప్రయాణికురాలు పై డిఆర్ఐ అధికారులు అనుమానం రావడంతో విచారించారు. మహిళ బ్యాగులో ఆకుపచ్చ రంగులో కలిగిన ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే అది గంజాయి కి సంబంధించిన పదార్థంగా తేలింది.
బ్యాగులో నుంచి 6 కిలోల హైడ్రోపోనిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు వీటి విలువ 12 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
MOST READ :
-
Miryalaguda : అధికారుల ఆకస్మిక తనిఖీలు.. మద్రాస్ ఫిల్టర్ కాఫీ సీజ్.. పలు హోటళ్లకు భారీ జరిమానా..!
-
Task Force : టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు.. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పట్టివేత..!
-
Hyderabad : కోకాపేట్ లో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య..!
-
Miryalaguda : విందు కంటె రైతులే ముద్దు.. సీఎం రేవంత్ రెడ్డికి రూ.2 కోట్లు అందజేసిన ఎమ్మెల్యే బీఎల్ఆర్..!









