TOP STORIESBreaking Newsనిజామాబాద్

Nizamabad : మానవత్వమా.. నీ చిరునామా ఎక్కడ..!

Nizamabad : మానవత్వమా.. నీ చిరునామా ఎక్కడ..!

నిజామాబాద్ జిల్లా భీంగల్,, మన సాక్షి

నిజామాబాద్ జిల్లా బాల్కొండలో గత కొన్నాళ్లుగా అచేతనంగా పడి ఉంటున్న అవ్వా.. నిను పట్టించుకునే నాథుడే లేడాయే. బాల్కొండలోని పాత బస్టాండ్ సమీపంలో ధర్మశాల సమీపంలో మతి స్థిమితం లేని అనాథ మహిళ జీవచ్ఛవంలా పడి ఉన్నా దారిన పోయేవారు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. సుమారు 55 సంవత్సరాలు కలిగిన ఆ మహిళ గతంలో బాల్కొండలో తిరుగుతూ.. పొట్ట కూటి కోసం బిక్షాటన చేస్తుండేది.

వారం రోజుల నుండి అచేతనంగా పడి ఉండగా ఆదారిన పోయే అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోలేక పోగా, మానవత్వమా..! నీ చిరునామా ఎక్కడా ? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అచే తన స్థితిలో పడి ఉన్న అ అవ్వలేవ లేని స్థితిలో ఉంది. స్థానికులు ఇట్టి సమాచారాన్ని ఈ నెల 29 న ఆమె స్థితి గతులు పరిశీలించి 108 అంబు లెన్స్ ద్వారా చికిత్స అందించేందుకు 108 సిబ్బంది రాగ వారిని ఆమె బూతు మాటలు తిట్టడంతో గుమిగూడిన జనాలు ఆమె పళ్ళతో కోరుకుతుందని ఆమె వద్దకు వెళ్ళ వద్దని చెప్పారు.

పైగా ఆమెకు సంబంధించిన తోబుట్టువులు బాల్కొండ లోనే ఉన్నారని సమాచారం. ఆమెకు మతి స్థిమితంగా లేకపోగా ఆమె ఒంటరి కావలసిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ అధికారులు గాని ఎవరైనా దయార్థులు స్పందించి ఆమెను కాపాడి మానవ త్వాన్ని చాటుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

MOST READ : 

  1. District collector : అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదిక పంపాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు ఆదేశం..!

  2. Nelakondapalli : సివిల్ సప్లై గోదాములలో బియ్యం నిల్వలు పరిశీలించిన చైర్మన్..!

  3. Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్

  5. TG News : కుల గణన సర్వే రిపోర్ట్.. బీసీ జనాభా లెక్క తేలింది.. అధికారికంగా ప్రకటించిన కమిటీ..!

మరిన్ని వార్తలు