HYDRA : మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు..!
HYDRA : మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి అక్రమ నిర్మాణాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. చెరువులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు షెడ్ లు, భవనాలు నిర్మించుకోవడం వల్ల వర్షాకాలంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దాంతో తెలంగాణ ప్రభుత్వం ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రాను తీసుకొచ్చింది. ఆదివారం తెల్లవారుజామున మాదాపూర్ లోని సున్నం చెరువు ఎఫ్ టి ఎల్ లెవెల్ లో ఉన్న నిర్మాణాలను బుల్డోజర్ తో కూలగొడుతున్నారు.
ఈ చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు కాగా 2013లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేసిన సమయంలో 15 ఎకరాల 23 గుంటల చెరువు ఉంది. నీరు కూడా ఉన్నాయి. అయితే అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లుగా కబ్జాలు చేసి భవనాలు నిర్మించుకున్నారు. దాంతో హైడ్రా తో కూల్చివేస్తున్నారు.
సున్నం చెరువు ఎఫ్ టి ఎల్ లో సర్వే నెంబర్లు 12, 13 , 14, 16 ఉన్నాయి. FTL లోనే అనేక షెడ్లు నిర్మాణాలు చేసి వ్యాపారాలు సైతం చేస్తున్నారు. ఈ చెరువు నుంచి వచ్చే నీరు తమ కాలనీలలోకి వచ్చి సామాన్య పేదల ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. దాంతో హైడ్రాకు కాలనీవాసులు సపోర్ట్ చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తూ ఉండగా నిర్మాణాలు చేసుకున్న వారు లబోదిబో అంటున్నారు.
LATEST UPDATE :
Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
నల్లగొండ మున్సిపాలిటీకి అత్యుత్తమ గౌరవం.. దేశంలోనే రెండో స్థానం.. 25 లక్షల నగదు పురస్కారం..!
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో నేటి నుంచి రూ.10వేలు..!
Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..!









