Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : నా భర్త నాకు కావాలి.. అత్తింటి ముందు కోడలు ధర్నా..!

Suryapet : నా భర్త నాకు కావాలి.. అత్తింటి ముందు కోడలు ధర్నా..!

సూర్యాపేట, మనసాక్షి :

నా భర్త నాకు కావాలని జిల్లా కేంద్రంలోని తొమ్మిదో వార్డుకు(ఎన్టీఆర్ కాలనీ) చెందిన భూపతి సరిత (రాజేశ్వరి) కోరుతూ మంగళవారం ఆమె అత్తగారి ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023 ఫిబ్రవరి నెల పదో తారీఖున జిల్లా కేంద్రంలోని9 వ వార్డుకు చెందిన భూపతి నరేందర్ తో వివాహం జరిగిందని తెలిపారు.

ఆయన తండ్రి మరణానంతరం ఆర్టీసీ కండక్టర్ గా యాదగిరిగుట్ట డిపో లో నాలుగు నెలల క్రితం ఉద్యోగం రాగా మరో వివాహం చేసుకుంటానని తనను నిత్యం వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అత్త , మరిది , అత్త తమ్ముడు తనను గత మూడు నెలలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని , ఎండలో నిల్చో పెడుతున్, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

నా ఆరోగ్యం సరిగా లేదని నా భర్త ఇటీవల వైద్య పరీక్షలు కూడా నిర్వహించారని వైద్య పరీక్షలు సక్రమంగా రావడంతో అదనపు కట్నం తీసుకురావాలని తనను ఇంట్లోకి రాకుండా తాళం వేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే నేను 15 లక్షల కట్నం , పది తులాల బంగారం తీసుకువచ్చారని మరల అదనంగా కట్నం తీసుకురావాలని లేకుంటే నేను ఇంకో వివాహం చేసుకుంటానని భర్త నరేందర్ వేధిస్తున్నాడని తెలిపారు.

గత సంవత్సరం డిసెంబర్ ఆరో తేదీన విడాకుల కాగితాలు కోర్టు ద్వారా పంపడం జరిగిందని ఈనెల ఆరో తేదీన కోర్టుకు హాజరైన తాను విడాకులు ఇచ్చేది లేదని లాయర్ ని నియమించుకొని పోరాటం చేసే విధంగా కోర్టు నుంచి అనుమతి తీసుకున్నానని తెలిపారు. అత్తింటివారు తనని ఇంట్లోకి రాకుండా తాళాలు వేసుకొని వెళ్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు నాకు న్యాయం చేయాలని కోరారు.

MOST READ :

  1. ACB : ఫోన్ పే ద్వారా లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ సురేష్..!

  2. Nalgonda : రైతుబంధు కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తాడు..!

  3. District Collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ లో అమ్మితే లైసెన్సులు రద్దు..!

  4. Scam Alert : మల్టీ లెవెల్ మార్కెటింగ్ గేటుగాళ్ల కొత్త ట్రిక్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

  5. Rythu Bharosa : రైతు భరోసా.. వారు అలా.. వీరు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు