Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

ACB : ఫోన్ పే ద్వారా లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ సురేష్..!

ACB : ఫోన్ పే ద్వారా లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ సురేష్..!

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ మంగళవారం దాడులు చేయడం సంచలన సృష్టించింది. పీడీఎస్ రేషన్ బియ్యం కేసులో బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. లక్ష 40,000 రూపాయలకు బేరం కుదిరింది. మొదటి విడతగా 30 వేల రూపాయలను ఫోన్ పే ద్వారా సూర్యాపేట లక్ష్మీ ఫీలింగ్ స్టేషన్ అకౌంట్ కు బదిలీ చేయించుకున్నారు.

మరొక రోజు ఏ 2 నాగరాజు పదివేల రూపాయలు ఫోన్ పే ద్వారా అకౌంట్ కు బదిలీ మరొక 30 వేల రూపాయలు బదిలీ చేయించుకున్నారు. 40 వేల రూపాయలు కానిస్టేబుల్ నాగరాజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేరాయి. ఎస్సై సురేష్ కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా 30 వేల రూపాయలను బాధితుడి నుంచి బదిలీ చేయించుకున్నారు. మిగతా 70 వేల రూపాయల బ్యాలెన్స్ ను ప్రత్యక్షంగా మంగళవారం అందిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

కేసు వివరాలు ప్రకారం ఇటీవల అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న విషయంలో సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి కి చెందిన మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని తిరుమలగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ నెంబర్ 12 / 2025 నమోదు చేశారు. బి ఎన్ ఎస్ ఎస్ అండర్ సెక్షన్ 35 కింద నోటీసు మాత్రమే ఇచ్చి రిమాండ్ చేయకుండా ఉండడానికి గాను పోలీసులు లంచం అడిగినట్టు ఏసీబీ అధికారులకు బాధితుడు చంద్రశేఖర్ తెలిపారు.

ఈ కేసు విషయంలో లక్ష 40 వేల రూపాయలు పోలీసులకు ఇవ్వడానికి ఒప్పందం జరగడంతో బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించారు. ఒప్పందం ప్రకారం లక్ష 40,000 ల లో మిగతా బ్యాలెన్స్ ఉన్న 70 వేల రూపాయలు ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు లు మంగళవారం తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన ఏసీ బీ అధికారులు వెంటనే దాడులు నిర్వహించి ఎస్ఎస్ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు లను అదుపులోకి తీసుకొని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

MOST READ :

  1. Karnataka to telangana : కర్ణాటక నుంచి తెలంగాణకు నల్ల బెల్లం రవాణా.. భారీగా పట్టివేత..!

  2. District Collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ లో అమ్మితే లైసెన్సులు రద్దు..!

  3. Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!

  4. Rythu Bharosa : రైతు భరోసా.. వారు అలా.. వీరు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Nalgonda : వీళ్లు మామూలోళ్ళు కాదు.. పార్కింగ్ చేసిన లారీలు కనిపిస్తే మాయం..! 

మరిన్ని వార్తలు