TOP STORIESBreaking Newsజాతీయం

Govt Scheme : ఆడపిల్ల పుడితే తల్లికి రూ. 6000.. స్పెషల్ స్కీం.. దరఖాస్తు ఇలా..!

Govt Scheme : ఆడపిల్ల పుడితే తల్లికి రూ. 6000.. స్పెషల్ స్కీం.. దరఖాస్తు ఇలా..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

రీసెంట్ గా తల్లి అయిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆడపిల్ల పుడితే తల్లికి ఆరువేల రూపాయలను డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలో వేసే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY) నిర్వహిస్తోంది. ఈ పథకం చాలా మందికి తెలియదు. అందుకు గాను 2025 ఆగస్టు 15వ తేదీ వరకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అంగన్వాడి, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి. నమోదు చేసుకుంటున్నారు.

ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం ద్వారా తల్లులు కాబోతున్న వారికి, రీసెంట్ గా తల్లులు అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. మొదటి బిడ్డ పుట్టినప్పుడు 5000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఐదువేల రూపాయలను మూడు విడతలుగా ప్రెగ్నెన్సీ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ₹1000, ఒకసారి ప్రసూతి పరీక్ష నిర్వహించిన తర్వాత 2000 రూపాయలు, డెలివరీ అయిన తర్వాత బిడ్డ పుట్టినట్లు రిజిస్టర్ చేయించుకుని టీకా వేయించిన తర్వాత 2000 రూపాయలను ప్రభుత్వం అందజేస్తుంది.

అదేవిధంగా రెండవ కాన్పులో ఆడపిల్ల పుడితే 6000 రూపాయలను అందజేస్తారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా లో డైరెక్ట్ గా డబ్బులు జమ చేస్తారు.

ఎవరు అర్హులు..?

కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకానికి ఎవరు అర్హులు అంటే..? ఆహార భద్రత కార్డు, సంవత్సర ఆదాయం 8 లక్షల లోపు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి, దివ్యాంగుల సర్టిఫికెట్, ఈ శ్రామ్ కార్డు, ఏదైనా కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు.

దరఖాస్తు ఎలా చేసుకోవాలి..?

ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకానికి స్థానిక అంగన్వాడి కేంద్రంలో రిజిస్టర్ చేసుకోవాలి. సంబంధిత ఆశా వర్కర్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. అందుకు కావలసిన డాక్యుమెంట్లు అందజేయాలి. అడ్రస్ ప్రూఫ్ (ఆధార్ కార్డు)ను ఇవ్వాల్సి ఉంటుంది. రెండో విడత కోసం చైల్డ్ బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్ జిరాక్స్ ను ఇవ్వాలి.

MOST READ : 

  1. Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!

  2. Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!

  3. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!

  4. TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!

  5. Gold Price : మరోసారి గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఒక్కరోజే రూ.2200..!

మరిన్ని వార్తలు