క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా

Karate : మేడారంలో కరాటే పోటీలలో.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయం..!

Karate : మేడారంలో కరాటే పోటీలలో.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయం..!

వెంకటాపురం, మన సాక్షి

ములుగు జిల్లా వెంకటాపురం మండలం భోదపురం గ్రామం జిపిఎస్ విద్యార్థులు ఈనెల మార్చి 2 న మేడారంలో జరిగిన కరాటి పోటీల్లో ఘనవిజయం సాధించారు.

కరాటె పోటీలో పాల్గొని మెడల్స్ సాధించిన విద్యార్థులను పూజారి యశస్విని గోల్డ్ మెడల్, పొడెం ఆద్య శ్రీ గోల్డ్ మెడల్, బాడిస భాను గోల్డ్ మెడల్, కారం హర్షవర్ధన్ సిల్వర్, కారం అక్షిత, బాడిస నోహిత్, తెల్లం నాగవర్ధన్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు.

ఈరోజు తమ పాఠశాలలలోని ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమక్షంలో బోదాపురం జిపిఎస్ ప్రధానోపాధ్యాయురాలు విజయ్ కుమారి మేడం కరాటి పోటీలో విజయం సాధించిన విద్యార్థులను అభినందించడం జరిగింది.

చదువులోనే కాకుండా ఇలాంటి కరాటే పోటీల్లో ఎంతో చురుకుగా పాల్గొని విజయం సాధించి తమ స్కూలుకి మంచి పేరు తీసుకొచ్చినందుకు హెచ్ ఎం మేడం పిల్లలను ఎంతో అభినందించారు. గ్రామంలోని పూనం రామారావు అనే కరాటే మాస్టర్ స్కూల్లోని పిల్లలందరికీ ఉచితంగా రోజు సాయంత్రం కరాటే నేర్పించేవారు.

పిల్లలు ఎంతో ఉత్సాహంగా కరాటే నేర్చుకోవడంతో వారిలోని ప్రతిభను మాస్టారు గుర్తించి తానే స్వయంగా కొంతమంది పిల్లలను కరాటి పోటీలో పాల్గొనేందుకు కృషి చేశారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ మెడల్స్ రావడం చాలా గర్వకారణం.

విద్యార్థులను చదువులోనే కాకుండా క్రీడా రంగంలో కూడా వారి ప్రతిభను గుర్తించి విద్యార్థులను సపోర్ట్ చేయాలని కరాటే మాస్టర్ పూనం రామారావు మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విజయాని కారణమైన కరాటే మాస్టారుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 134 మంది పంచాయతీ కార్యదర్శులకు చార్జ్ మెమో..!

  2. Hyderabad : గాంధీలో డాక్టర్ల డుమ్మా.. మంత్రి ఆకస్మిక పర్యటనలో వెలుగులోకి, శోకాజ్ నోటీసులకు ఆదేశం..!

  3. Miryalaguda : మున్సిపాలిటీ వారి సువర్ణ అవకాశం.. 25 శాతం రాయితీ..!

  4. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!

  5. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!

మరిన్ని వార్తలు