Nalgonda : మీ ఊరిలో మీరే రేవంత్ రెడ్డి, మీరే కోమటిరెడ్డి.. ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!
Nalgonda : మీ ఊరిలో మీరే రేవంత్ రెడ్డి, మీరే కోమటిరెడ్డి.. ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!
నల్లగొండ, మన సాక్షి.
సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయాలని ఏఐసీసీ సెక్రెటరీ, జిల్లా ఇంచార్జ్ సంపత్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండ లోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సంస్థగత పునర్నిర్మాణంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు
గత 10 సంవత్సరాలుగా బిఆర్ఎస్ కుటుంబ పాలన సాగించిందని విమర్శించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తుందని వెల్లడించారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తూ దేశంలోనే ఆగ్రగామిగా నిలుస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ- ప్రభుత్వం జోడెడ్ల లాగా పనిచేస్తుందని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసినప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే మండల కాంగ్రెస్ పార్టీ కమిటీలను వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు
జిల్లా కమిటీలో పనిచేసే వారికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగాప్రతనియోజకవర్గం నుంచి ఇద్దరికీ రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్, బోర్డు డైరెక్టర్లుగా సామాజిక సమతుల్యత పాటించి అవకాశం కల్పించడం జరుగుతుందని వెల్లడించారు.
ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ప్రతిపాదనలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసినప్పుడే ఏ ఎన్నిక లోనైనా విజయంసాధ్యపడుతుందన్నారు. మీ ఊరిలో మీరే రేవంత్ రెడ్డి అని, మీరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కోరారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని, ఆ దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని తెలిపారు.
పార్టీలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. త్వరలో జరిగే ఎన్నికలలో అందరూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసంసన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులతో పాటు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలుఅమలవుతున్నాయని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్లగొండ,తిప్పర్తి, కనగల్ మాజీ జెడ్పిటిసిలు వంగూరి లక్ష్మయ్య,పాశం రామ్ రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, నల్లగొండ మాజీ ఎంపీపీ మనిమద్ది సుమన్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప్ రెడ్డి, ఆర్టిఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి,
నల్గొండ పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లి సుభాష్ యాదవ్, జూలకంటి శ్రీనివాస్, అరుణాకర్ రెడ్డి,వంగాల అనిల్ రెడ్డి దుబ్బ అశోక్ సుందర్, చింత యాదగిరి,మామిడి కార్తీక్, గాలి నాగరాజు, పాదం అనిల్, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









