Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు.. జడ్పీ సీఈఓ కు ఫిర్యాదు..!
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు.. జడ్పీ సీఈఓ కు ఫిర్యాదు..!
పెన్ పహాడ్, మన సాక్షి :
పెన్ పహాడ్ మండలంలో వివిధ గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలతో 29 గ్రామపంచాయతీలలో ఎక్కువగా భూములు ఉన్నవారికి పక్కా ఇల్లు కలిగిన వారికి పూరిండ్లు ఉన్న వారిని వదిలిపెట్టి కొంతమంది వారి స్వార్థం కొరకు పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులను ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేసినారని పెన్ పహాడ్ చీదెళ్ల పిఎసిఎస్ వైస్ చైర్మన్ వావిళ్ళ రమేష్ గౌడ్ మంగళవారం సూర్యాపేట జిల్లా ప్రజా పరిషత్ సీఈవో వి వి అప్పారావుకు వినతి పత్రం అందజేసినారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్ పహాడ్ మండల వ్యాప్తంగా అధికార పార్టీకి అనుకూలంగా సంపన్న కుటుంబాలకు ఇండ్లను కేటాయిస్తున్నారని ఎంపిక చేసిన లిస్టును ఎంపీడీవోకు అందజేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా పాలక పక్షానికి అనుకూలంగా ఇందిరమ్మ కమిటీ వారు పంపిన పేర్లను ఎంపిక చేస్తున్నారు తప్ప ,అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకోక ఇల్లు లేని పేదలకు మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ పథకాలు పేద ప్రజలకు కాకుండా భూస్వాములకు సంపన్నులకు కట్టబెడుతున్నారని మండలంలో ఇందిరమ్మ కమిటీలకు అనుకూలంగా కుటుంబాలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కమిటీ సభ్యులు ప్రవర్తించటం ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించటమేనని ఆయన అన్నారు.
గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు అనరుల ఎంపిక లిస్టును ఉన్నంత అధికారులు పరిశీలించి గ్రామాలలో నిరుపేద పూరి గుడిసెలు ఉన్న వారికి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వ అధికారులను కోరినారు. ఇప్పటికైనా మండల అభివృద్ధి అధికారి ఇందిరమ్మ ఇళ్లలో జరుగుతున్న పొరపాట్లను వివిధ గ్రామాలలో ఎంపికైన లిస్టును ప్రతి గ్రామములో ఎంక్వైరీ చేసి భూములున్న పక్కా భవనములు కలిగిన, ఎకరాల కొద్ది భూములు ఉన్న వారిని, లిస్టుల నుండి తొలగించి నిరుపేదలకు న్యాయం చేయాలని ఆయన కోరినారు.
ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసిన గ్రామపంచాయతీ ముందు అతికించవలసిన కార్యదర్శులు లిస్టులు బయట పెట్టడం లేదని గోప్యంగా ఉంచుతున్నారని ఆయన ఆరోపించినారు. ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన చేపడుతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గంగారపు శ్రీనివాస్, భూక్య అశోక్ ,భూక్య వెంకటేశ్వర్లు, సంటి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : భరోసాపై రైతన్నలకు శుభవార్త.. ఖాతాల్లోకి నగదు ఇప్పుడే.. లేటెస్ట్ అప్ డేట్..!
-
Gold Offers : అక్షయ తృతీయకు అదిరిపోయే బంగారం ఆఫర్లు.. తెలుసుకోండి ఇవే..!
-
Gold Price : గోల్డ్ మళ్లీ డమాల్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!









