Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Rythu Bharosa : భరోసాపై రైతన్నలకు శుభవార్త.. ఖాతాల్లోకి నగదు ఇప్పుడే.. లేటెస్ట్ అప్ డేట్..!

Rythu Bharosa : భరోసాపై రైతన్నలకు శుభవార్త.. ఖాతాల్లోకి నగదు ఇప్పుడే.. లేటెస్ట్ అప్ డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం పై రైతన్నలకు మరోమారు శుభవార్త తెలియజేసింది. 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ పథకం ద్వారా రైతులకు ఎకరానికి 12,000 రూపాయలను రెండు విడతలుగా అందజేయనున్నారు. ఒక విడత రైతు భరోసా పథకంలో పంట పెట్టుబడి సహాయాన్ని మార్చి 31వ తేదీలోగా రైతుల ఖాతాలలో జమ చేస్తామని ప్రకటించారు.

కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. దాంతో రైతులు రైతు భరోసా పంట పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేశారు. అదేవిధంగా కొత్తగా దరఖాస్తులు చేసుకున్న 1.50 లక్షల రైతులకు కూడా రైతు భరోసా అందజేసింది.

నాలుగు ఎకరాలపైగా ఉన్న రైతులకు రైతు భరోసా అందజేసే విషయంపై మే మొదటి వారంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టత ఇవ్వనున్నారు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు కేటాయించింది. కాగా రైతు భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు అధికారులు ఈ పథకం కోసం నిధుల సేకరణలో ఉన్నారు. నిధులు సమకూరగానే రైతుల ఖాతాలలో నేరుగా జమ చేయనున్నారు.

MOST READ : 

  1. Gold Offers : అక్షయ తృతీయకు అదిరిపోయే బంగారం ఆఫర్లు.. తెలుసుకోండి ఇవే..! 

  2. TG News : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

  3. PM Kisan : పీఎం కిసాన్ రైతులకు కీలక అప్డేట్.. ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!

  4. Gold Price : గోల్డ్ మళ్లీ డమాల్.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు