TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవైద్యం

Treatment : కప్పింగ్ తెరపి హిజామా.. నొప్పుల నివారణకు వినూత్న వైద్యం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Treatment : కప్పింగ్ తెరపి హిజామా.. నొప్పుల నివారణకు వినూత్న వైద్యం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

నల్లగొండ, మన సాక్షి :

కప్పింగ్ తెరపి (హిజామా) వలన శరీరంలోని కండరాల నొప్పి, శ్వాసకోశ సమస్యలు, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు వంటి 94 రకాల అనారోగ్య పరిస్థితులకు చికిత్స అందించి నయం చేయవచ్చని, డాక్టర్ ఫసీన్ ఆల్ తన్వీర్ తెలిపారు. ఆదివారం ఆయన మాన్యంచలకలోని బహుదూర్ ఖాన్ కమ్యూనిటీ హాల్ లో నొప్పులకు వినూత్నమైన వైద్యాన్ని అందిస్తూ వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ నొప్పుల నివారణకు కప్పింగ్ తెరపి అంటే శరీరంలో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ కప్పింగ్స్ పెట్టి కొన్ని రసాయన మందుల ద్వారా తెరపి చేసి చెడు రక్తాన్ని వ్యర్థాలను వెలుపలికి తీయడం వలన రక్త ప్రసరన సాఫీగా జరిగి కండరాల దృఢత్వం, ఆందోళన, ఒత్తిడి తగ్గి ,మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు.

ఈ తరహా వైద్యానికి హైదరాబాద్ తో పాటు అనేక నగరాలలో మంచి స్పందన వచ్చి త్వరగా రోగం నయమవుతుందని తెలిపారు, నల్లగొండలో ఈ వైద్య శిబిరానికి భారీ స్పందన కనిపించింది, కార్యక్రమంలో తెరపిస్ట్ ఎండి ఖలీల్ ,హఫీజ్, జక్రియ, కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.

By : ChandraShekar, Nalgonda 

MOST READ : 

  1. Nalgonda : 15 నెలల కొడుకుని బస్టాండ్ లో వదిలేసిన యువతి.. ప్రియుడితో జంప్.. సర్వత్రా చర్చ..!

  2. Suryapet : సూర్యాపేట జిల్లాలో సంచలనం.. ఏడాది క్రితం అదృశ్యమైన వ్యక్తి ప్రత్యక్షం.. అది ఏంటో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే..!

  3. District collector : ఎరువుల విక్రయాల్లో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆధార్ నమోదు తప్పనిసరి..!

  4. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్.. మీడియా పేరుతో వసూళ్లు..!

మరిన్ని వార్తలు