District collector : ఎరువుల విక్రయాల్లో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆధార్ నమోదు తప్పనిసరి..!
District collector : ఎరువుల విక్రయాల్లో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆధార్ నమోదు తప్పనిసరి..!
జగిత్యాల, (మన సాక్షి) :
ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో నమోదు చేయాలని కలెక్టర్ బి.సత్య ప్రసాద్ తెలిపారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్యాక్స్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను, ఎరువుల సరఫరా పై యూరియా ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు సరఫరా చేస్తున్నారో పరిశీలించి వారి యొక్క భూమి వివరాలను డాటా ఎంట్రీలో తనిఖీ చేశారు. ప్రస్తుతం రైతులు వేసిన పంటకు అవసరమైన ఎరువులు మాత్రమే సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.
రికార్డులు పరిశీలించి స్టాక్ ఎంత వచ్చింది ఎంత సరఫరా చేసాం అన్నది తప్పనిసరి రికార్డ్ చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ రైతులకు ఎవరికైనా ఎక్కువ మొత్తంలో ఎరువులు , డిఏపి, యూరియా బస్తాలు ఎక్కువ పంపిణి చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బంది పై వ్యవసాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట జగిత్యాల జిల్లా మున్సిపల్ అధికారి స్పందన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వినీల సహకార పాక్స్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
By : Mahendar, Jagityal
MOST READ ;
-
IPO : కొత్త డయాలిసిస్ క్లినిక్ల ఏర్పాటు కోసం రూ. 129.1 కోట్లు..!
-
Suryapet : పిల్లలమర్రి వాసికి వందేండ్ల ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్..!
-
Khammam : వడ్డీల వ్యాపారి ఇంట్లో పోలీసుల సోదాలు.. రూ. 90 లక్షల విలువైన వాహనాలు జప్తు..!
-
TG News : చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డిఎస్పీలు మృతి..!
-
TG News : గ్రామ పాలన అధికారుల పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. ఇవీ పరీక్షకు తీసుకరావల్సినవి, తీసుకరాకూడనివి..!









