క్రీడలుBreaking NewsTOP STORIES

Bettings : గుట్టు చప్పుడు కాకుండా.. జోరుగా ఐపీఎల్ బెట్టింగ్..!

Bettings : గుట్టు చప్పుడు కాకుండా.. జోరుగా ఐపీఎల్ బెట్టింగ్..!

దమ్మపేట, మన సాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పలు గ్రామాల్లో ఐపీఎల్ బెట్టింగ్ దందా యథేచ్ఛగా సాగుతుంది. మ్యాచ్ లపై యువత రూ.లక్షల్లో బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ పలువురు ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతూ రూ. లక్షల్లో డబ్బులను పోగొట్టుకుంటున్నారు. అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలో పలు మండలాలలో యువత ఐపీఎల్ మ్యాచ్లపై డబ్బులు వస్తాయని ఉద్దేశంతో భారీగా బెట్టింగ్లకు పాల్పడుతున్నారు.

మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో బెట్టింగ్ జోరుగా గుట్టు చప్పుడు కాకుండా పలువురు యువతను బెట్టింగ్ లకు ఆకర్షిస్తూ వారి జేబులు ఖాళీ అయ్యే విధంగా వ్యవహరిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఐపీఎల్ ప్రారంభమై కేవలం మూడు రోజులు మాత్రమే అవుతున్న బెట్టింగులు మాత్రం రూ. లక్షల్లో కొనసాగుతున్నాయి.

మ్యాచ్లను బట్టి ఆట ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్కంఠతో మ్యాచులు నడుస్తుండడంతో ఒక్కో ఓవర్ పై రూ.వేలల్లో బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. యువత బెట్టింగ్లకు పాల్పడుతూ తమ జేబులను ఖాళీ చేస్తున్నారని ఈ బెట్టింగ్ వ్యవహారం పై పోలీసులకు చిక్కకుండా చేపడుతున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికైనా ఈ బెట్టింగ్ వ్యవహారం పై పోలీసులు పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేసి బెట్టింగ్లకు పాల్పడిన ముఠాను అదుపులోకి తీసుకోవాలని పలువురు భావిస్తున్నారు.

అమాయక యువతకు క్రికెట్ పై ఉండే ఆసక్తిని బట్టి రాయుళ్లు బెట్టింగ్లకు పాల్పడే విధంగా ప్రోత్సహిస్తున్నారని ఫలితంగా యువత బెట్టింగ్లకు పాల్పడుతూ తమ విలువైన డబ్బులను పోగొట్టుకుంటున్నారని తెలుస్తుంది.

ఇప్పటికైనా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఐపీఎల్ బెట్టింగ్లపై పోలీసులు గట్టిగా నిఘా ఏర్పాటు చేసి బెట్టింగ్ రాయుళ్ల ఆట కట్టించాలని పలువురు గ్రామ పెద్దలు కోరుతున్నారు. ఇప్పుడే బెట్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టకపోతే మరో నెలపాటు జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి భారీ ఎత్తున బెట్టింగ్ జరిగే అవకాశం లేకపోలేదు.

MOST READ :

  1. Hyderabad : ప్రస్తుతం ఎక్కడ బెటర్.. విదేశాల్లో భారతీయులకు విస్తృత అవకాశాలు..!

  2. Rythu Bharosa : రైతు భరోసా పై రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో డబ్బులు జమ..!

  3. TG News : బెట్టింగ్ యాప్ కేసులో కీలక మలుపు.. సర్కార్ కీలక నిర్ణయం..!

  4. Mahila : మహిళా రైతులకు 50% రాయితీ పై వ్యవసాయ పనిముట్లు..!

  5. Good News : రూ.1500 చెల్లిస్తే లక్ష రూపాయలు.. రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఎప్పుడో..!

మరిన్ని వార్తలు