Mahila : మహిళా రైతులకు 50% రాయితీ పై వ్యవసాయ పనిముట్లు..!
Mahila : మహిళా రైతులకు 50% రాయితీ పై వ్యవసాయ పనిముట్లు..!
చింతపల్లి, మన సాక్షి :
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా రైతులకు వ్యవసాయ యాంత్రికరణ పై సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మేకనైజేషన్ పథకం ద్వారా 50 శాతం రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందజేసేందుకు బడ్జెట్ కేటాయించడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారిని శ్రావణ్ కుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిధిలో రాయితీపై 20 యూనిట్లు కేటాయించడం జరిగిందని వారన్నారు.
అందులో బ్యాటరీ స్ప్రేయర్ల 6, తైవాన్ స్ప్రేయర్లు 6, రోటవేటర్లు3, ట్రాక్టర్ కు సంబంధించిన పనిముట్లు కల్టివేటర్, ఎంబి ప్లగ్, కేజీవిల్, సీడ్ డ్రిల్ ఇవ్వనున్నారన్నారు. ఈ రాయితీని పొందేందుకు మహిళా రైతు పేరు మీద పాసుబుక్కు కలిగి భూమి నామోదయి ఉండాలన్నారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన దృవపత్రాలు పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ జిరాక్స్, అప్లికేషన్ ఫారం, ట్రాక్టర్ ఆర్ సి, దరఖాస్తు దారాలు యొక్క మూడు పాస్ ఫోటోలు అప్లికేషన్ ఫారం నింపి అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు ఆసక్తిగల మహిళా రైతులు మీ క్లస్టర్ ఏ ఈ ఓ ను సంప్రదించాలని వారు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.
MOST READ :
-
Gold Price : వరుసగా పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
-
Watermelon : పుచ్చకాయ తీసుకుంటున్నారా.. వీటిని చెక్ చేయకపోతే రుచిలేని పండుతో డబ్బులు బొక్క..!
-
Summer Tours : టూర్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ బడ్జెట్, టాప్ 10 సమ్మర్ టూరిస్ట్ ప్లేసేస్..!
-
Aeroplane: విమానంలో తీసుకెళ్లే నగదుకి పరిమితులున్నాయా.. ఏవి తీసుకెళ్లొద్దో తెలుసుకుందాం..!









