Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newstravelహైదరాబాద్

Aeroplane: విమానంలో తీసుకెళ్లే నగదుకి పరిమితులున్నాయా.. ఏవి తీసుకెళ్లొద్దో తెలుసుకుందాం..!

Aeroplane: విమానంలో తీసుకెళ్లే నగదుకి పరిమితులున్నాయా.. ఏవి తీసుకెళ్లొద్దో తెలుసుకుందాం..!

హైదరాబాద్ :

విమాన ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా కొన్ని నింబంధనలను తెలుసుకోవాలి. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు నగదు పరిమితులు వేర్వేరుగా ఉంటాయి. దేశంలోనైనా, విదేశాల్లోనైనా డబ్బు విత్‌డ్రా చేసే సౌలభ్యం ఉన్నప్పటికీ, చాలా మంది సౌలభ్యం కోసం నగదును తమ వెంట తీసుకెళ్లడానికి ఇష్టపడతారు. అయితే, విమాన ప్రయాణంలో నగదు తీసుకెళ్లడానికి నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. ఈ నియమాలు ఏమిటి, ఆ పరిమితిని దాటితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

పరిమితి ఎంతంటే?

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. దేశీయ విమాన ప్రయాణాల్లో ప్రయాణికులు గరిష్టంగా రూ.2 లక్షల నగదును తీసుకెళ్లవచ్చు. అయితే, అంతర్జాతీయ ప్రయాణాలకు ఈ నియమం వర్తించదు, ఇందుకు వేరే నిబంధనలు ఉన్నాయి.

అంతర్జాతీయంగా..

నేపాల్, భూటాన్ మినహా ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు 3,000 యూఎస్ డాలర్ల వరకు విదేశీ కరెన్సీని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. ఒకవేళ ఈ మొత్తం కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లాలనుకుంటే, స్టోర్డ్ వాల్యూ కార్డులు లేదా ట్రావెలర్స్ చెక్స్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణాల్లో దేశాల వారీగా నియమాలు మారవచ్చు కాబట్టి, గమ్యస్థాన దేశం యొక్క కస్టమ్స్ నిబంధనలను ముందుగా తెలుసుకోవడం మంచిది.

పరిమితిని దాటితే?

ఒకవేళ నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లి, దానిని కస్టమ్స్ అధికారులకు డిక్లేర్ చేయకపోతే, ఆ నగదు స్వాధీనం చేసుకోవడం లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. ఉదాహరణకు, యూఎస్‌లో 10,000 డాలర్ల కంటే ఎక్కువ నగదు తీసుకెళితే తప్పనిసరిగా డిక్లేర్ చేయాలి. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే, నగదు సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.

సామగ్రి బరువు పరిమితులేంటి?

విమాన ప్రయాణంలో నగదు పరిమితితో పాటు వెంట తీసుకెళ్లే బరువుకు కూడా నిర్దిష్ట నియమాలు ఉన్నాయి. హ్యాండ్ లగేజీ బరువు 7 కిలోలను మించకూడదు, అయితే చెక్-ఇన్ లగేజీ బరువు 20 నుంచి 30 కిలోల వరకు ఉండవచ్చు. ఈ నియమాలు దేశీయ, అంతర్జాతీయ విమానాలకు వర్తిస్తాయి. అయితే, ఈ బరువు పరిమితులు విమాన సంస్థలను బట్టి మారవచ్చు కాబట్టి, ఖచ్చితమైన సమాచారం కోసం సంబంధిత విమాన సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించడం మంచిది.

తీసుకెళ్లకూడని వస్తువులు ఏంటి?

విమాన ప్రయాణంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడం నిషేధం. ఉదాహరణకు, క్లోరిన్, ఆసిడ్, బ్లీచ్ వంటి రసాయన పదార్థాలను తీసుకెళ్లడానికి అనుమతి లేదు.

సలహాలు, సూచనలు : 

డబ్బు ఎక్కడ ఉంచాలి: నగదును చెక్-ఇన్ లగేజీలో కాకుండా, హ్యాండ్ లగేజీలో ఉంచడం సురక్షితం. చెక్-ఇన్ లగేజీలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది.

డాక్యుమెంటేషన్: పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తున్నప్పుడు, ప్రూఫ్ (బ్యాంక్ విత్‌డ్రాయల్ రసీదు, ఉద్యోగ ధృవీకరణ లేఖ వంటివి) తీసుకెళ్లడం మంచిది. ఇది అధికారులు ప్రశ్నించినప్పుడు ఉపయోగపడుతుంది.

ప్రత్యామ్నాయాలు: నగదు బదులు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, లేదా ప్రీ-పెయిడ్ ట్రావెల్ కార్డులను ఉపయోగించడం సురక్షితమైన ఎంపిక. ఇవి భద్రతతో పాటు ఖర్చుల ఎలక్ట్రానిక్ రికార్డును కూడా అందిస్తాయి.

విమాన ప్రయాణంలో ఈ నియమాలను పాటించడం ద్వారా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

Reporting : Vishal, Hyderabad 

MOST READ : 

  1. Nalgonda : ధాన్యం కు రూ.500 బోనస్ సద్వినియోగం చేసుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

  2. Rythu Bharosa : రైతు భరోసా, ఆత్మీయ భరోసా అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే.. బిగ్ అప్డేట్..!

  3. Recharge : బంపర్ ఆఫర్.. కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌ రూ.101నుంచే.. ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌,. నాన్-స్టాప్ క్రికెట్ ..!

  4. TG News : రైతులకు భారీ షాక్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు